దిల్ రాజుతో సైరా డైరెక్టర్ అగ్రిమెంట్.. తెరపైకి ప్రభాస్, మహేష్ బాబు పేర్లు
ఇటీవలే మెగాస్టార్ హీరోగా ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహా రెడ్డి రూపొందించి విమర్శకుల ప్రశంసలు పొందారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ సినిమా కోసం ఆయన పడిన తపన, తీసుకున్న శ్రద్ధ మంచి రిజల్ట్ తెచ్చిపెట్టాయి. దీంతో ఆయన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడనే దానిపై దృష్టి పెట్టాయి ప్రేక్షక వర్గాలు. ఇంతలో ఇందుకు సంబంధించిన ఓ వార్త బయటకు రావడం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పుతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దామా..

దిల్ రాజుతో డీల్.. హీరో విషయంలో తర్జన భర్జన
సురేందర్ రెడ్డి తీసుకొచ్చిన స్క్రిప్ట్ చూసి ఫిదా అయ్యారట దిల్ రాజు. ఈ మేరకు ఈ మధ్య డీల్ కుదిరిందనేది తాజా సమాచారం. తన సొంత బ్యానర్ లోనే సురేందర్ రెడ్డితో సినిమా చేస్తానని మాటిచ్చారట దిల్ రాజు. ఇందుకు సంబంధించిన పనులు కూడా వేగవంతం చేయమని ఆయనతో చెప్పారట. అయితే తన వద్ద ఉన్న కథను ఏ స్టార్ హీరోతో చేయాలా? అనే ఆలోచనలో పడ్డారట సురేందర్ రెడ్డి.

ఆ ఇద్దరిలో ఒకరితో కన్ఫర్మ్
ఈ మేరకు తన వద్ద ఉన్న స్క్రిప్ట్ ప్రకారం ప్రభాస్, మహేష్ బాబులలో ఎవరైనా సూట్ అవుతారని సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. ఇప్పటికే తనదైన స్టైల్లో ఓ కథ సిద్ధం చేసుకుని ఇటు మహేష్ బాబుకి, అటు ప్రభాస్‌కి వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. సో.. ఆ ఇద్దరిలో ఒకరితో మాత్రం సురేందర్ రెడ్డి సినిమా కన్ఫర్మ్ అని తెలుస్తోంది. దీనిపై అతిత్వరలో ఆయనో నిర్ణయానికి రానున్నారట.

దిల్ రాజు ప్లాన్.. సురేందర్ రెడ్డితో
హీరోగా మహేష్ బాబు గానీ, ప్రభాస్ గానీ ఎవ్వరిని తీసుకున్నా తనకెలాంటి అభ్యంతరం లేదని సురేందర్ రెడ్డితో అన్నారట దిల్ రాజు. ఈ సినిమా కోసం తాను భారీ బడ్జెట్ కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ ఫైనల్ చేయాల్సిందిగా దిల్ రాజు పేర్కొన్నారని తెలుస్తోంది.

మహేష్, ప్రభాస్ ఇద్దరూ కూడా
మరోవైపు మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరూ కూడా వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తుండగా, సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తన తదుపరి సినిమాలో నటిస్తున్నారు. చూడాలి మరి సురేందర్ రెడ్డితో ఈ ఇద్దరిలో ఎవరు సెట్ అవుతారా? అనేది.


Click it and Unblock the Notifications











