For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్‌పై సురేందర్ రెడ్డి కామెంట్స్: దీని వెనుక అసలు కారణం ఇదేనా.!

  By Manoj
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సురేందర్ రెడ్డి. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అతనొక్కడే' సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నాన్ని మొదలు పెట్టిన ఈయన.. తర్వాత టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేశాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా సూరీకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. ఇటీవలే ఈయన సినిమా విడుదలైంది. ఇటీవల ఆయన ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఈ వ్యాఖ్యల వెనుక కారణం ఇదేనంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా కారణం.? వివరాల్లోకి వెళితే...

  ప్రతిష్టాత్మక సినిమాతో వచ్చాడు

  ప్రతిష్టాత్మక సినిమాతో వచ్చాడు

  మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా: నరసింహారెడ్డి'ను తెరకెక్కించాడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై స్వయంగా నిర్మించాడు. ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అయితే, కమర్షియల్‌గా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

   ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు

  ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు

  ‘సైరా' తర్వాత సురేందర్ రెడ్డి.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేస్తాడని, అది కూడా పాన్ ఇండియా సినిమా అని జోరుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ‘జాన్'ను కూడా పక్కన పెట్టేశాడని కూడా వార్తలు వచ్చాయి. దీని తర్వాత సురేందర్ రెడ్డి.. సూపర్ స్టార్ మహేశ్ బాబును డైరెక్ట్ చేయబోతున్నాడని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు' తర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుందని అన్నారు.

  ఎన్టీఆర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్

  ఎన్టీఆర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్

  ఇటీవల సురేందర్ రెడ్డి ఓ ప్రముఖ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్' సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘అతనొక్కడే' హిట్ కొట్టిన తర్వాత ఎన్టీఆర్ గారి మేనేజర్ సుకుమార్ నన్ను ఓ చోటుకు తీసుకెళ్లాడు. తారక్ సార్‌తో సినిమా చేయాలని మూడు రోజుల పాటు నన్ను మెంటల్‌గా బ్లాక్‌మెయిల్ చేశాడు. ఇందుకోసం ఓ కథను నా చేతిలో పెట్టారు. దీంతో ఇష్టం లేకున్నా ఆ సినిమా చేయాల్సి వచ్చింది' అని సూరీ చెప్పుకొచ్చాడు.

  తారక్ వల్లే ప్రభాస్ మిస్

  తారక్ వల్లే ప్రభాస్ మిస్

  ఎన్టీఆర్ సినిమా కోసం ప్రభాస్‌తో కమిట్‌మెంట్‌ను పక్కన పెట్టేశానని సురేందర్ రెడ్డి వెల్లడించాడు. ‘వాస్తవానికి నేను ప్రభాస్‌తో సినిమా చేయడానికి కమిట్‌మెంట్ ఇచ్చాను. అయితే, ‘అశోక్' సినిమా చేయడం వల్ల ఆయనతో పని చేసే అవకాశాన్ని కోల్పోయాను. ఈ సినిమా ఫ్లాప్ అవడం వెనుక నా పొరపాట్లు కూడా ఉన్నాయి' అని ఆయన పేర్కొన్నాడు.

  సూరీ వ్యాఖ్యలకు కారణం ఇదేనా?

  సూరీ వ్యాఖ్యలకు కారణం ఇదేనా?

  జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి సురేందర్ రెడ్డి కామెంట్స్ చేయడం వెనుక బలమైన కారణం ఉందట. సైరా తర్వాత సూరీ.. తారక్‌కు ఓ కథను వినిపించాడట. అది ఆయనకు నచ్చకపోవడంతో ఒప్పుకోలేదట. ఈ కారణంగానే సురేందర్ రెడ్డి.. జూనియర్‌పై కామెంట్స్ చేశాడని అంటున్నారు. ఇదే విషయాన్ని నందమూరి అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు.

  #CineBox : RRR Update : Olivia Morris Pairup With Jr. NTR In RRR Movie !
  మరో ఛాన్స్ ఇచ్చాడు

  మరో ఛాన్స్ ఇచ్చాడు

  సురేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల జూనియర్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వాళ్లు ఎన్నో అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నారు. ‘అశోక్' ఫ్లాప్ అయిన తర్వాత కూడా ‘ఊసరవెల్లి' రూపంలో తారక్ మరో అవకాశం ఇచ్చినా.. సురేందర్ రెడ్డి ఇలా కామెంట్లు చేయడం దారుణమని నందమూరి అభిమానులు అంటున్నారు.

  English summary
  Director Surender Reddy recently met actor Varun Tej, setting off speculation that he may rope in the actor for his next film instead of Prabhas. Varun Tej, who was supposed to do a film with debutant director Kiran Korrapati, may give preference to Surender Reddy, who recently garnered plenty of appreciation for Sye Raa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more