Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాహుబలికి సైరాకు పోలికేంటి ..? డైరెక్టర్ సురేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఆయన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదలయింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ఈ సినిమా బాహుబలి రేంజ్ లో ఉండబోతోందంటూ టాక్ బయటకొచ్చింది. దీనిపై డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యాడు.
అది చూసి పొరపాటు పడుతున్నారు
సైరా మేకింగ్ వీడియోలో బ్యాక్ డ్రాప్, విజువల్స్ చూసి ఈ సినిమాను బాహుబలి సినిమాతో పోల్చుతున్నారు. కానీ బాహుబలికి ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. సైరా అనేది నిజ జీవితంలో జరిగిన కథ. చాలా జాగ్రత్తగా నిజాల్ని చూపించాలి. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక దర్శకుడికి ఫ్రీడమ్ ఇవ్వాల్సినంత ఇచ్చి ఉయ్యాలవాడ నరసింహా పాత్రలో అద్భుతంగా నటించారు. అంతేకానీ బాహుబలి సినిమాను గానీ, ఆ కాన్సెప్ట్యూను గానీ తాము దృష్టిలోకి రానివ్వలేదని అన్నారు సురేందర్ రెడ్డి.
అవన్నీ ఒట్టి రూమర్స్
సైరా అనేది ఓ పెద్ద ప్రాజెక్ట్. కేవలం ఇంత సమయంలోనే ఫినిష్ చేయాలని చేసే సినిమా కాదు. కొన్ని సీన్లు షూట్ చేసేందుకు సమయం ఎక్కువ పట్టొచ్చు. అందుకే షూటింగ్ ఆలస్యం అయింది. అంతేకానీ సురేందర్ రెడ్డి మేకింగ్ వల్ల చాలా సీన్స్ ని రీ షూట్ చేయాల్సి వచ్చిందని అందుకే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకా రాలేదంటూ వస్తున్న గాసిప్స్ లో అర్థం లేదని సురేందర్ రెడ్డి పేర్కొన్నాడు.
మేకింగ్ వీడియోకి భారీ స్పందన
నిన్న(బుధవారం) విడుదల చేసిన సైరా మేకింగ్ వీడియోకు భారీ స్పందన వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా కావడంతో ఈ వీడియోకు కొద్ది సమయంలోనే విశేష స్పందన లభించింది. యూట్యూబ్‌లో విడుదలైన గంటలోనే దాదాపు రెండు లక్షల వ్యూస్ సంపాదించి ఆ తర్వాత కొద్ది సేపటిలోనే మిలియన్ మార్కును అందుకుంది. దీనికి తోడు మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్లు చేస్తుండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సైరా నరసింహా రెడ్డి మూవీ
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.