సురేందర్ రెడ్డితో చేయబోయే స్టార్ హీరో ఎవరు?
'మిరపకాయ్" చిత్రం నిర్మాత రమేష్ పుప్పాల తన తదుపరి యత్నంగా ఓ అగ్ర హీరోతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారాయన.ఇప్పుడు ఆ స్టార్ హీరో ఎవరనేది ఇండస్ట్రీలో హాట్ గా మారిన అంశం.గోపిచంద్ అని కొందరు అంటూంటే కాదు ప్రభాస్ అని మరికొందరు అంటున్నారు. ఇక ఆ సినిమా గురించి చెపుతూ ఆయన ఈ సినిమా మా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ ఖ్యాతిని పదింతలు పెంచే విధంగా ఉంటుందని చెప్పారు. చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోలందరితో సినిమాలను నిర్మించాలనుందని, ఇక నుంచి ఏడాదికి రెండు, మూడు చిత్రాలు తన బ్యానర్ నుంచి వస్తాయని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











