సురేంద్ర రెడ్డి నెక్ట్స్ ఆ హీరోతో ఖరారు
అతనొక్కడే చిత్రంతో పరిచయమైన సురేంద్ర రెడ్డి ఆ తర్వాత వెనతిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఊసరివిల్లి చిత్రం డైరక్ట్ చేస్తున్న సురేంద్ర నెక్స్ట్ ప్రాజెక్టు నాగార్డున తో కమిటయ్యాడని తెలుస్తోంది.కామాక్షి బ్యానర్ పై ఈ చిత్రం నిర్మించటానికి సంభదించిన చర్చలు పూర్తయ్యయాని చెప్తున్నారు.ఇక నాగార్జున ప్రస్తుతం ఢమురుకం,షిర్డీ సాయిబాబా, రాజన్న చిత్రాలు చేస్తున్నారు.ఆ చిత్రాల గ్యాప్ లో ఈ సినిమాని ప్రారంభించనున్నట్లు చెప్తున్నారు.
విక్కీదాదా' నుంచి 'రగడ' వరకు నాగార్జునతో పలు హిట్ చిత్రాలను నిర్మించిన కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మాత. ఈ తాజా చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది. నిర్మాత చిత్ర విశేషాలను వెల్లడిస్తూ "నాగార్జునగారితో కామాక్షి బేనర్‌లో జనవరి నుంచి మరో భారీ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం.ఆగస్ట్ 12న చైతన్య 'దడ'ను విడుదల చేస్తున్నాం. ఆగస్ట్ చివరి వారంలో నాగార్జునగారి చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాం. నాగార్జున-కామాక్షి కాంబినేషన్‌లో ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తాం'' అని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











