సురేంద్రరెడ్డి చాలా డిజప్పాయింట్ అయ్యాడు
హైదరాబాద్ : స్టార్ డైరక్టర్ సురేంద్ర రెడ్డి..రీసెంట్ గా చాలా డిజప్పాయింట్ అయ్యారు. అదేంటి ఆయన రీసెంట్ చిత్రం రేసు గుర్రం బాగానే ఆడింది కదా అంటున్నారు. అసలు విషయం అది కాదు. ఆయన డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ కిక్ ని ఇప్పుడు హిందీలోకి రీమేక్ చేసి వదిలారు. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఆయన చాలా ఉత్సాహంగా వెళ్లి చూసి వచ్చారు. అయితే చూసి చాలా నిరాశపడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తన అభిమానలతో పంచుకున్నారు.
సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ...కిక్ హిందీ రీమేక్ చిత్రం చూసాను. ఆ సినిమా మన ఒరిజనల్ తెలుగు సినిమాకు, సల్మాన్ ఖాన్ కు ఇద్దరికీ న్యాయం చేయలేదు. కిక్ సినిమా ఆత్మని సరిగ్గా పట్టుకుంటే సల్మాన్ కెరీర్ లోనే పెద్ద హిట్ చిత్రం అయ్యేది అన్నారు.

ఇక సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం తొలిరోజే కలెక్షన్స్ వర్షం కురిసింది. శుక్రవారం రోజే ...ఇరవై ఆరు కోట్లు రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో సల్మాన్ సరసన...జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించింది.
సాజిద్ నడియాడ్ వాలా రూపొందించిన ఈ చిత్రంలో రణదీప్ హుడా, నవాజుద్దీన్ ఇతర పాత్రల్లో మెప్పించారు. నవాజుద్దీన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నర్గీస్ ఫక్రీ ఐటం సాంగ్ లో చిందేసింది. ఈ సినిమాకు భాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ వచ్చింది.


Click it and Unblock the Notifications











