జూ ఎన్టీఆర్, నేను రిస్కు చేశాం...లేడీస్‌ని రప్పించాం
ద్వితీయార్థంలో హీరోయిన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మీకు రిస్క్ అనిపించలేదా?...అన్న ప్రశ్నకు రిస్క్ అనుకుంటే ఏమీ సాధించలేం, ఇప్పుడు మేము చేసిన ఆ ప్రయోగమే మహిళా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది అంటున్నారు ఊసరవెల్లి సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ... తన ప్రయోగానికి ఎన్టీఆర్ కూడా చాలా పాజిటివ్‌గా స్పందించారు. సెకండాఫ్ హీరోయిన్ తమన్నా నటన అందరి ప్రశంసలు అందుకుంటోంది, ఆ సంతృప్తి చాలన్నారు.
ఎన్టీఆర్ లాంటి నటుడు దొరకడం రియల్‌గా హ్యాపీగా ఫీలవుతున్నా. మాస్, క్లాస్ అనే తేడాలేకుండా ఫుల్ మీల్స్‌లాంటి సినిమా చేశాననే సంతృప్తి ఈ చిత్రం ద్వారా లభించింది నాకు. ఇది నా దృష్టిలో ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్. చిత్రం బాగుండలేదని టాక్ వస్తే ఇటువంటి కలెక్షన్లు రావు అన్న సంగతి అందరికీ తెలుసు. సినిమా హిట్ అయితే దానిని ఏ శక్తులూ ఆపలేవు అనేది నేను నమ్మిన సిద్ధాంతం అని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమన్నా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది, ఈ చిత్రానికి అవార్డు కూడా వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. కిక్ సినిమా హిందీలో కూడా నేనే చేసే అవకాశాలున్నాయి. కిక్ చిత్రంలో హీరో రణబీర్‌కపూర్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఊసరవెల్లి చిత్రం కూడా బాలీవుడ్‌లో అడుగుతున్నారు. మరో వారంరోజుల్లో ఫైనలైజ్ అవుతుందని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











