‘సైరా’: ఒక్క ఫోటోతో అందరి నోరూ మూయించిన సురేందర్ రెడ్డి!

By Bojja Kumar

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. చిరంజీవి, సురేందర్ రెడ్డి కెరీర్లోనే కాదు.... తెలుగు సినిమా పరిశ్రమకే ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తొలిసారి తెలుగు తెరపై కనిపించబోతున్నారు.

Recommended Video

Amitabh Bachchan And Jagapathi Babu Charecters Details In 'SYERA'
అమితాబ్ విషయంలో అనేక పుకార్లు

అమితాబ్ విషయంలో అనేక పుకార్లు

సైరా సినిమాకు సంబంధించి కొన్ని రోజులుగా అమితాబ్ బచ్చన్ విషయంలో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్ కూడా తప్పుకున్నాడంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ లాంటి టాప్ టెక్నీషియన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం, అమితాబ్ విషయంలో ఇలాంటి ప్రచారం మొదలవ్వడంతో మెగా అభిమానుల్లో సైతం ఆందోళన మొదలైంది.

ఒక్క ఫోటోతో అందరి నోరూ మూయించిన సురేందర్ రెడ్డి

ఒక్క ఫోటోతో అందరి నోరూ మూయించిన సురేందర్ రెడ్డి

అయితే ఒకే ఒక్క ఫోటోతో ‘సై రా' సినిమాపై గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్న అందరి నోరూ మూయించారు సురేందర్ రెడ్డి. ముంబైలో అమితాబ్‌ను కలిసి ‘సైరా' సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు డేట్స్ ఖరారు చేసుకున్నారు. ఇందుకు సంబందించిన ఫోటోను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

అనుమానాలు పటాపంచలు

అనుమానాలు పటాపంచలు

బిగ్ బితో కలిసి ఫోటో దిగడం ద్వారా మెగా అభిమానుల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేయడంతో పాటు వారిలో కొత్త ఉత్సాహం నింపారు సురేందర్ రెడ్డి. అమితాబ్ సైరా షూటింగులో ఎప్పుడు పాల్గొంటారనే విషయం త్వరలో వెల్లడించనున్నారు.

రెండో షెడ్యూల్లో అమితాబ్

రెండో షెడ్యూల్లో అమితాబ్

‘సైరా నరసింహారెడ్డి' షూటింగ్ ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమై మొదటి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కాబోతోంది. రెండో షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్ పాల్గొనే అవకాశం ఉంది. ఆయన డేట్స్ బట్టి సైరా రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

సైరా గురువు పాత్రలో బిగ్ బి

సైరా గురువు పాత్రలో బిగ్ బి

సైరా నరసింహారెడ్డికి గురువు పాత్రను అమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తున్నట్లు సమాచారం. సినిమాలో బిగ్ బి పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోందని అంటున్నారు. ఈ చిత్రం ద్వారా తొలిసారి ఇద్దరు మెగాస్టార్లు కలిసి ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు.

చిరంజీవి స్పెషల్ మేకోవర్

చిరంజీవి స్పెషల్ మేకోవర్

‘సైరా' సినిమాలో చిరంజీవి యంగ్ లుక్‌తో కనిపించడం కోసం నేచురోపతి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా శరీరం కాంతివంతం అవుతుందని, స్కిన్ రేడియేట్ అవుతుందని, అందుకే మెగాస్టార్ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

శరవేగంగా షూటింగ్

శరవేగంగా షూటింగ్

‘సైరా' చిత్రం కాస్త లేటుగా ప్రారంభం అయినా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తవ్వగా..... త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. మెగా తనయుడు రామ్ చరణ్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు.

అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నయనతార హీరోయిన్

నయనతార హీరోయిన్

‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ నయనతార ఎంపికయింది. ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువ అయినా నిర్మాత రామ్ చరణ్ వెనకడుగు వేయడం లేదు. ఈ చిత్రం కోసం ఆమె రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్.

ఇళయరాజా సంగీతం?

ఇళయరాజా సంగీతం?

ఈ సినిమాకు ఇంకా సంగీత దర్శకుడు కన్ఫర్మ్ కాలేదు. మొదట ఈ చిత్రం కోసం రెహమాన్‌ను ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వలన ఆయన తప్పుకున్నారు. ఆ తరువాత కీరవాణి, థమన్ పేర్లు వినిపించాయి. తాజాగా మరో సంగీత దర్శకుడి పేరు 'సైరా' చిత్రం కోసం వినిపిస్తోంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాను 'సైరా' కోసం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

150 కోట్ల భారీ బడ్జెట్

150 కోట్ల భారీ బడ్జెట్

కొణిదెల ప్రొడక్షన్స్‌ బేనర్లో రూ. 150 కోట్ల బడ్జెట్‌తో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని రామ్ చరణ్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నేషనల్ లెవల్లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X