రవితేజ హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో సినిమా రూపు దిద్దుకోబోతోంది. సురేందర్ రెడ్డి కళ్యాణ్ రామ్ తో తీసిన "అతనొక్కడే" సినిమా హిట్ అయింది. రవితేజతో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ తీస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమా షూటింగ్ లో 40 శాతం అమెరికాలోనే జరుగుతుంది. త్రిషను హీరోయిన్ గా పెడదామని మొదట అనుకున్నప్పటికీ ఆమె కమల్ హసన్ చిత్రం "మర్మయోగి"కి 200 రోజుల బల్క్ కాల్షీట్లు ఇవ్వడంతో ఇబ్బంది వచ్చి పడింది. కాబట్టి నిర్మాతలు మరో పెద్ద హీరోయిన్ కోసం అన్వేషణలో పడ్డారు. రవితేజ తాజా చిత్రం "నేనింతే" డిసెంబర్ లో విడుదల కానుంది. ఆ సినిమా విడుదలైన వెంటనే సురేందర్ రెడ్డి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.