భారీ అంచనాలతో వచ్చిన అతిథి అనుకున్నంతగా ఆడకపోవటంతో సురేంద్రరెడ్డి డైలమాలో పడ్డాడు. మరో ప్రక్క పెద్ద హీరోల డేట్సు కోసం ట్రై చేస్తుంటే దొరకటంలేదు. చేతిలో హిట్ లేకపోతే పరిశ్రమ ఎలా రియాక్టు అవుతుందో మెల్లిగా అర్ధమైనట్లుంది. దాంతో ఈ సారి ఓ కొత్త హీరోని పరిచయం చేయటానికి రెడీ అవుతున్నాడు. ఆ హీరో డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఈ చిత్రం నిర్మిస్తుందిట. అలాగే ఎప్పటిలాగే 10 కోట్లు పైనే బడ్జెట్ తో సినిమా ఉంటుందిట. కెరీర్ ప్రారంభంలో అతనొక్కడే సినిమాతో టెక్నికల్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు సురేంద్ర రెడ్డి. తర్వాత యన్టీ ఆర్ తో చేసిన అశోక్ యావరేజి అయింది. తర్వాత మహేష్ బాబు తో అతిథి నిరాశపపచటం జరిగింది. తరువాత సునీల్ తో బంతి చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. కాని అదీ కార్యరూపం దాల్చలేదు. శ్రేయోభిలాషుల సలహా మేరకు యాక్షన్ సినిమాకే లైఫ్ ఉంటుందని ఈ ప్రాజెక్టు శ్రీకారం చుడుతున్నారని తెల్సింది. దాంతో సురేంద్రరెడ్డి మళ్ళీ అతనొక్కడే నాటి మేజిక్ ని రిపీట్ చేస్తాడని అందరూ ఆశిస్తున్నారు.