సురేంద్ర రెడ్డి తదుపరి చిత్రం గురించి...
ఊసరవెల్లి తో మరోసాటి టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ఉన్న దర్శకుడుగా సురేంద్ర రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్టు సూపర్ మ్యాన్, బాట్ మాన్ వంటి సూపర్ హీరో సినిమా తెలుగులో తీయాలని చెప్పుకొచ్చారు. అయితే అది డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పను కానీ తప్పని సరిగా చేసే సినిమా అని అన్నారు. అలాగే తన తదుపరి సినిమా గురించి చెపుతూ...ఆర్.ఆర్ మూవీ మేకర్స్ కు సినిమా కమిటయ్యాను. హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు అన్నారు. ఇక ఆ చిత్రం ప్యూర్ లవ్ స్టోరీ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. అలాగే తాను బాలీవుడ్ ఎంట్రీ అంటే చాలా ఆసక్తి గా ఉన్నానని చెప్పారు. గతంలో కిక్ చిత్రం రీమేక్ అప్పుడు తనని పిలిచి అడిగారని కానీ ఊసరవెల్లి చిత్రాన్ని అప్పటికే కమిటై ఉండటంతో తాను చేయలేకపోయానని, ఇప్పుడు అవకాశం వస్తే తప్పుకుండా చేస్తానని అన్నారు. ఇక ఊసరవెల్లి చిత్రం బాలీవుడ్ రీమేక్ కోసం చాలా మంది అడుగుతున్నారని అన్నారు.ఇక తనకు పర్శనల్ గా కామిడీ చిత్రాలంటే ఇష్టమని అన్నారు. అందుకే కిక్ చిత్రం చేసానని అన్నారు.తాను రివెంజ్ డ్రామాలు చేయటంతో అందరూ అలాంటి సినిమాలే చేస్తారని అనుకుంటున్నారని,అందుకే కిక్ తో తన కామిడీ పవర్ చూపెట్టానని చెప్పారు. ఇక ఊసరవెల్లి లో అయితే లవ్, కామిడీ,యాక్షన్, రివేంజ్ మూడు కలపి ఇచ్చానని అన్నారు. చాలా మంది ఊసరవెల్లి చూసి రెగ్యులర్ కమిడియన్స్ అంటే బ్రహ్మానందంలాంటి వారు లేకుండానే కామిడీ చేసానని మెచ్చుకుంటున్నానని అన్నారు. ఇన్నాళ్లూ పూరి,వినాయిక్ వంటి వారు మాత్రమే కామిడీ,యాక్షన్ కలిపి చేయగలిగే వారని ఇప్పుడు తాను కాడా అలాంటి సినిమా చేయగలిగినందుకు గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











