ఎన్టీఆర్ ఏమాత్రం మార్చొద్దన్నారు
ఊసరవెల్లి ఫ్లాష్‌బ్యాక్‌లో తమన్నాకి ప్రాధాన్యం ఇవ్వడం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఆ ఎపిసోడ్ ఉండేది పది నిమిషాలే. ఆ పది నిమిషాల కథ లేకపోతే సినిమాయే లేదు. ఒకవేళ హీరో పట్టుబట్టి ఉంటే ఆ పది నిమిషాల కథని వేరేలా మార్చాల్సి వచ్చేది. కానీ ఎన్టీఆర్ ఏమాత్రం మార్చొద్దన్నారు అంటున్నారు సురేంద్ర రెడ్డి. ఆయన తన తాజా చిత్రం ఊసరవెల్లి ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఊసరవెల్లి ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా ఉందని మీడియా వారితో సురేందర్‌రెడ్డి చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ, సెంటిమెంట్, యూత్‌కి కావల్సిన అంశాలు ఉండటంవల్ల ఫుల్ మీల్ మూవీగా ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్‌లోనే మొదటి వారం ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రం ఇది అన్నారు. ఎన్టీఆర్ హీరోయిజమ్‌కి భిన్నంగా ఈ చిత్రం ఉందనే టాక్ ప్రచారంలో ఉందనే ప్రశ్న సురేందర్‌రెడ్డి ముందుంచగా అలా ఏం లేదు. ఈ చిత్రంలో తమన్నా తనకు ఓ వెలుగు చూపమని ఆంజనేయస్వామిని ప్రార్థించినప్పుడు ఆ వెలుగు ఎన్టీఆర్ అని చూపించాం. అంతకన్నా హీరోయిజమ్ ఏముంటుంది? అని ప్రశ్నించారు. ఇక ఊసరవెల్లి చిత్రం బాలీవుడ్ రీమేక్ కోసం చాలా మంది అడుగుతున్నారని అన్నారు.ఇక తనకు పర్శనల్ గా కామిడీ చిత్రాలంటే ఇష్టమని అన్నారు. అందుకే కిక్ చిత్రం చేసానని అన్నారు.తాను రివెంజ్ డ్రామాలు చేయటంతో అందరూ అలాంటి సినిమాలే చేస్తారని అనుకుంటున్నారని,అందుకే కిక్ తో తన కామిడీ పవర్ చూపెట్టానని చెప్పారు. ఇక ఊసరవెల్లి లో అయితే లవ్, కామిడీ,యాక్షన్, రివేంజ్ మూడు కలపి ఇచ్చానని అన్నారు. చాలా మంది ఊసరవెల్లి చూసి రెగ్యులర్ కమిడియన్స్ అంటే బ్రహ్మానందంలాంటి వారు లేకుండానే కామిడీ చేసానని మెచ్చుకుంటున్నానని అన్నారు. ఇన్నాళ్లూ పూరి,వినాయిక్ వంటి వారు మాత్రమే కామిడీ,యాక్షన్ కలిపి చేయగలిగే వారని ఇప్పుడు తాను కాడా అలాంటి సినిమా చేయగలిగినందుకు గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











