సురేంద్రరెడ్డి నెక్ట్స్ హీరో
కిక్ విజయంతో మరో మెట్టక్కిన దర్శకుడు సురేంద్రరెడ్డి త్వరలో ప్రబాస్ తో చిత్రం చేయనున్నట్లు సమాచారం. అందుకోసం స్టోరీ సిట్టింగ్స్ సైతం జరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే ఆ చిత్రానికి మిస్టర్ ఫెరఫెక్ట్ అనే టైటిల్ సైతం అనుకుంటున్నారని వినపడుతోంది. రవితేజ చేసిన కిక్ తరహాలో ఈ చిత్రం కూడా ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని అంటున్నారు. అయితే సురేంద్రరెడ్డి ఈ సారి ఓ ప్యూర్ లవ్ స్టోరీ తీస్తానని మీడియాలో చెప్తున్నాడు. అయితే ప్రభాస్ ని హీరోగా తీసుకుని యాక్షన్ చిత్రం చేస్తాడు గానీ లవ్ స్టోరీ చేయడు కదా తెలిసినవారు అంటున్నారు. గతంలోనూ కిక్ కి ముందు సాయికుమార్ కుమారుడుతో సినిమా చేయాలని ప్లాన్ చేసారు. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. కాబట్టి చెప్పేది ఏమైనా తెరకెక్కేది మాత్రం ఈ చిత్రమే అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్..పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం దిల్ రాజు నిర్మాతగా దశరధ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేసారు.అయితే డేట్స్ ఎడ్జేస్ట్ చేసిమరీ సురేంద్రరెడ్డికి సినిమా చేస్తాడనే అంటున్నారు.


Click it and Unblock the Notifications











