సురేంద్రరెడ్డి 'ఊసరివెల్లి' స్క్రిప్టు ఆ హీరోతో ఫైనల్...
కిక్ చిత్రంతో తానేమిటో మరోసారి నిరూపించుకున్న సురేంద్రరెడ్డి త్వరలో రాణాతో ఓ చిత్రం రూపొందించనున్నారు. ఈ మేరకు చర్చలు పూర్తయినట్లు సమాచారం. రామ్ కోసం తయారు చేసిన ఊసరివెల్లి కథను రాణాకి అనుగుణంగా చేర్పులు, మార్పులు చేసి ఒప్పించారు. అలాగే ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం అనంతరం ఆయన చేస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు వెంకటేష్ తో గంగ..ది డాన్, గోపిచంద్ తో బి.గోపాల్ దర్శకత్వంలో చిత్రం ప్లాన్ చేసారు. కానీ అవి వర్కవుట్ కాలేదు. ఇక సురేంద్రరెడ్డి..మహేష్ తో చేయబోయే మిస్టర్ ఫెరఫెక్ట్ 2011 నుంచి ప్రారంభం కానుంది. దాంతో ఈ లోగా ఈ ఊసరివెల్లిని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రం కథని సురేంద్రరెడ్డి, రామ్ ల కాంబినేషన్లో రామ్ అండ్ జెన్నీగా ప్రారంభించారు. అలాగే కథ అద్బుతంగా కుదిరిందని,క్యారెక్టర్ అదిరిందని ఓపినింగ్ రోజున ఊదరకొట్టారు. కానీ కథ ఇంకా ఓ కొలిక్క రాకపోవటం,బడ్జెట్ పెరిగిందని స్రవంతి రవికిషోర్ ఈ ప్రాజెక్టుకు మంగళం పాడినట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











