»   » మరో దశాబ్దానికి నటుడిగా జూ. ఎన్టీఆర్..సురేంద్ర రెడ్డి

మరో దశాబ్దానికి నటుడిగా జూ. ఎన్టీఆర్..సురేంద్ర రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నవంబర్ 16కి తారక్ హీరో అయి పదేళ్ళు పూర్తయింది. నవంబర్ 17న ఈ చిత్రంతో మరో దశాబ్దానికి నటుడిగా ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రం మరో ఎత్తు. ఇందులో ఓ కొత్త ఎన్టీఆర్ ని చూస్తారు అని దర్శకుడు సురేంద్రరెడ్డి చెప్పారు. సురేంద్రరెడ్డి, జూ.ఎన్టీఆర్ ల కొత్త చిత్రం ఈ రోజు(బుధవారం) శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర సంస్ధ కార్యాలయంలో ఉదయం 9.30 ని||లకు ప్రారంభమైంది. అలాగే ఎన్టీఆర్ నుండి ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే సరికొత్త టైప్ లో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఎన్టీఆర్ సరసన తమన్నా ఓ హీరోయిన్. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది అన్నారు.

నిర్మాత బి.వి.ఎస్.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్ తో ఓ భారీ చిత్రం తీయాలన్న కోరిక ఈ చిత్రంతో నేరవేరుతోంది. ఎన్టీఆర్ కు ఫర్ఫెక్ట్ గా సూట్అయ్యే అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అయింది. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించి జనవరి 8 నుండి ఏకధాటిగా షేడ్యూల్ చేస్తాం. మా బ్యానర్ కి ఇది ప్రేస్టీజియస్ మూవీ అవుతుంది' అన్నారు.

ఎన్టీఅర్, తమన్నా, కిక్ శ్యాం, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్ధి, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, వేణు మాధవ్, ఎమ్.ఎస్. నారాయణ, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, వెనకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కధ...వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రసూల్ ఎల్లూర్, పాటలు: చంద్రబోస్, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: కోటగిరి విద్యాధరరావు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, స్క్రీన్-ప్లే, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu