‘ఊసరవెల్లి’వసూళ్లు గురించి సురేంద్రరెడ్డి

By Srikanya

ఎన్టీఆర్ హీరోగా తన దర్శకత్వంలో రూపొందిన ఊసరవెల్లి చిత్రం ఘన విజయం సాధించిందంటూ దర్సకుడు సురేంద్రరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. ఆయన మాటల్లో...ఈ దసరాను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నాం. తొలిరోజే మా సినిమా భారీవసూళ్లను అందించి అందరికీ ఆనందాన్నిచ్చింది. మా హీరో, నిర్మాతలదే ఆ క్రెడిట్‌ అన్నారు . అలాగే ఒక్క తొలిరోజే 15కోట్ల 75లక్షల గ్రాస్‌ వసూలు చేసి 'ఊసరవెల్లి" సరికొత్త రికార్డ్‌ సృష్టించిందని పంపిణీదారుడు, నిర్మాత కె.అచ్చిరెడ్డి తెలిపారు.

రాయలసీమలో 2కోట్ల 92లక్షలు, నైజామ్‌లో 3కోట్ల 73లక్షలు, నెల్లూరులో 49లక్షలు, గుంటూరులో కోటి 43లక్షలు, కృష్ణలో 75లక్షలు, విశాఖలో 66లక్షలు, తూ.గో జిల్లాలో 71లక్షలు, ప.గో జిల్లాలో 63లక్షలు, అమెరికాలో కోటి 98లక్షలు, ఇతరచోట్ల (ఒరిస్సా, చెనై్న, మహారాష్ట్ర, ఉత్తరభారతం)..కోటి 30లక్షల వసూళ్లు సాధించిందని వివరాలు వెల్లడించారు. ఇక నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ భారీ విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్‌ఆర్‌ మూవీమేకర్స్‌ అండ్‌ ఆర్‌.ఆర్‌.డిస్ట్రిబ్యూటర్స్‌ ప్రతినిధి, మాక్స్‌ఇండియా అధినేత, నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ 'కిక్‌ -ఆర్‌ఆర్‌ సంస్థ తొలిమూవీ. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. తర్వాత అదే దర్శకుడినుంచి మరో భారీ విజయం ఇది. తొలిరోజే రికార్డ్‌ వసూళ్లు వచ్చాయి. హీరోయిజం, హాస్యం, ఉద్వేగం, సెంటిమెంట్‌, రిచ్‌నెస్‌ అన్నీ కలగలిసిన చిత్రమిది. ఎన్టీఆర్‌ డాన్సులు, పంచ్‌ డైలాగులు..జనాల్ని విశేషంగా అలరిస్తున్నాయి. తమన్నా నటన అద్భుతంగా ఉందని ప్రశంసలొస్తు న్నాయి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X