అభిరామ్- శ్రీరెడ్డి ఇష్యూపై తొలిసారి మీడియాతో సురేష్ బాబు... ఏమన్నారంటే?

By Bojja Kumar

Recommended Video

Suresh Babu First Reaction On Sri Reddy And Abhiram Issue

పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'ఈ నగరానికి ఏమైంది?' అనే సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత సురేష్ బాబు ఓ టీవీ ఛానల్‌కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, తన కుమారుడు అభిరామ్... శ్రీరెడ్డి ఇష్యూకు సంబంధించి, అమెరికా సెక్స్ రాకెట్ గురించి ప్రశ్నలు ఎదుర్కొన్న ఆయన తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

‘ఈ నగరానికి ఏమైంది’ గురించి

‘ఈ నగరానికి ఏమైంది’ గురించి

ఈ నగరానికి ఏమైంది? అనేది ఈ తరం యువత లైఫ్ స్టైల్, హోప్స్, ఫెయిల్యూర్స్, సక్సెస్ గురించి ఉంటుంది. ఇది పూర్తిగా తరుణ్ భాస్కర్ మూవీ. నిర్మాత కూడా ఆయనే. నేను కేవలం ఫైనాన్షియల్ ప్రొడ్యూసర్ మాత్రమే. ఈ సినిమా విషయంలో వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. మీకు నచ్చిన విధంగా సినిమా తీయండి అన్నాను. తెలుగులో బడ్డీ రొమాన్స్ కొత్త రకంగా ప్రజంట్ చేశారు అని సురేష్ బాబు తెలిపారు.

అందుకే తరుణ్ భాస్కర్ మీద నమ్మకం

అందుకే తరుణ్ భాస్కర్ మీద నమ్మకం

తరుణ్ భాస్కర్ మీద అంత నమ్మకం ఉండటానికి కారణం అతడికి క్రాఫ్ట్ బాగా వచ్చు. అతడు, అతడి టీమ్ ఒక ప్రాసెస్‌లో పని చేస్తున్నారు. ఆ ప్రాసెస్‌లో చాలా వరకు బాగా చేస్తున్నారు. కొన్ని నేర్చుకుంటున్నారు. ప్రాసెస్, క్రాఫ్ట్ బాగా తెలిసిన వారు ఇండస్ట్రీలో త్వరగా ముందుకు వెళతారు. అలాంటి వారికి హెల్ప్ చేయాలనే ఉద్దేశ్యంతోనే అతడితో వరుస సినిమాలు చేస్తానని చెప్పాను. మనకు ఫైనల్‌గా కావాల్సింది మనమైనా మంచి సినిమాలు తీయాలి, లేక మన చుట్టూ ఉన్నవాళ్లు మంచి సినిమాలు తీస్తే ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది... అని సురేష్ బాబు తెలిపారు.

నా మీద మ్యాజిక్ ఏమీ చేయలేదు

నా మీద మ్యాజిక్ ఏమీ చేయలేదు

ఇండస్ట్రీలో చాలా మంది సురేష్ బాబుకు కథలు ఒకపట్టాన నచ్చవు అంటుంటారు. తరుణ భాస్కర్ మీ మీద చేసిన మ్యాజిక్ ఏమిటి? అనే ప్రశ్నకు సురేష్ బాబు స్పందిస్తూ... అతడు నా మీద మ్యాజిక్ ఏమీ చేయలేదు. అతడు మొదటన నాకు పెళ్లి చూపులు కథ చెప్పాడు. దాన్ని అతడు కథ చెప్పిన దానికన్నా సినిమాగా బాగా తీశాడు. నేను చూసి షాకయ్యాను. అంత బాగా తీస్తాడని కూడా అనుకోలేదు. ఆ సినిమా చూసిన తర్వాత అతడి మీద నమ్మకం ఏర్పడింది అని సురేష్ బాబు తెలిపారు.

 వెంకటేష్, చైతు, రానాలతో సినిమాలు

వెంకటేష్, చైతు, రానాలతో సినిమాలు

సురేష్ ప్రొడక్షన్స్ పెద్ద సినిమాలు చేసి రిస్క్ తీసుకోవడానికి భయపడుతోందా? అనే ప్రవ్నకు ఆయన స్పందిస్తూ... మేము పవన్ కళ్యాణ్-వెంకటేష్ తో ‘గోపాల గోపాల' తీశాం. ఇపుడు వెంకటేష్-చైతన్యతో బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాం. తర్వాత వెంకటేష్-రానాతో మరో సినిమా చేయబోతున్నాం. ఇలా మా సంస్థ నుండి మరిన్ని పెద్ద సినిమాలు రాబోతున్నాయి.

ఇండస్ట్రీలో వందల కోట్ల కలెక్షన్లలో నిజం ఎంత?

ఇండస్ట్రీలో వందల కోట్ల కలెక్షన్లలో నిజం ఎంత?

రూ. 150 కోట్లు, రూ. 200 కోట్ల కలెక్షన్ అని చెప్పుకుంటున్నారు. అందులో నిజం ఎంత? అనే ప్రశ్నకు సురేష్ బాబు స్పందిస్తూ... అందులో చాలా నిజాలున్నాయి, చాలా అబద్దాలు కూడా ఉన్నాయి. నిజాలు ఏవి? అబద్దాలుఏవి? అనేది ఇండస్ట్రీలో ఉన్నవారికి తెలుస్తుంది. కొంత మంది నిజాలను అబద్దాలనుకుని బ్రతికేసి వారి సినిమా అంత చేయకపోయినా అంత చేస్తుందనే భ్రమలో పడిపోయి కాస్ట్ పెంచేసుకుని తర్వాత రియాల్టీలో ఉండకుండా సఫర్ అవుతుంటారు. మన సినిమా నిజంగా ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం తెలుసుకుంటే... మనకూ మంచిది, మనతో పని చేసే వారికి మంచిది అని సురేష్ బాబు వ్యాఖ్యానించారు.

డ్రగ్స్, వ్యభిచారం కొత్తేమీ కాదు

డ్రగ్స్, వ్యభిచారం కొత్తేమీ కాదు

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఈ మధ్య కాలంలో వచ్చిన నిందలు మన దురదృష్టం. ఇలాంటివి జరిగాయంటూ చెబుతున్నవి ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఇపుడు తెలుగు ఇండస్ట్రీ మీద బ్రాండింగ్ అయింది. డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్, వ్యభిచారం లాంటివి మనుషులు పుట్టినప్పటి నుండి జరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా మొదలైనవి కాదు. రాజుల కాలం నుండి డ్రగ్స్, వ్యభిచారం ఉన్నాయి. ఆడ, మగ ఉన్న ప్రతి చోట ఇవి జరుగుతాయి అని సురేష్ బాబు అన్నారు.

అది సోసైటీ నిర్ణయిస్తుంది

అది సోసైటీ నిర్ణయిస్తుంది

సొసైటీ అనేది కొన్ని నామ్స్ పెడుతుంది. ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు అని. ఇది లీగల్, ఇది ఇల్లీగల్ అని..... ఆ సొసైటీలో ఉన్న చట్టాల ప్రకారం మనల్ని శిక్షిస్తారు లేదా పొగిడేస్తారు. ఈ మధ్య కొన్ని విషయాలు బ్రాండ్ అయిపోయి, సెన్సేషన్ అయిపోయి నిజానికన్నా ఎక్కువ డ్రమటైజ్ అయిపోతున్నాము. మనకు ఎక్కువ సోషల్ మీడియా, ఎక్కువ టెలివిజన్ మీడియా రావడం వల్ల ఎక్కువ ఇన్ఫ్మర్మేషన్ డిస్ట్రాట్ అయిపోతోంది. నిజమూ డిస్ట్రాట్ అవుతుంది, అబద్దమూ డిస్ట్రాట్ అయిపోతోంది. ఏది రియాల్టీ, ఏది నిజం అనేది తెలుసుకోలేక పోతున్నాం... అన్నారు.

వేదాంతం చెప్పిన సురేష్ బాబు

వేదాంతం చెప్పిన సురేష్ బాబు

2500 ఏళ్ల క్రితంనాటి ఓ రాతి శాసనం మీద కూడా సొసైటీ బాగా మారిపోతుంది, చాలా కరప్షన్ జరుగుతోంది, మనుషులు మారిపోతున్నారు అని రాసి ఉంది. ప్రతి జనరేషన్లో ఇలాంటివి ఉన్నాయి. దేవుడి దయ వల్లనో, డెస్టినీ దయవల్లోనో కరెక్టివ్ మెజర్స్ వచ్చేస్తాయి, అన్నీ బాగా జరిగిపోతూ ఉంటాయి. లేక పోతే పతనం అయిపోయి నాశనం అయిపోతోంది.... అంటూ సురేష్ బాబు వేదాంతం చెప్పారు.

అభిరామ్, శ్రీరెడ్డి ఇష్యూ గురించి

అభిరామ్, శ్రీరెడ్డి ఇష్యూ గురించి

అభిరామ్, శ్రీరెడ్డి ఇష్యూ గురించి ప్రశ్నించగా..... నా పర్సనల్ విషయాలను నేను షేర్ చేయను. నాపై ఏదైనా వ్యక్తిగతంగా ప్రభావం చూపితే అది నా పర్సల్ సమస్య. దాన్ని నేను పరిష్కరించుకుంటాను. దాన్ని ప్రజలతో పంచుకోవాలనే ఆసక్తి నాకు లేదు. నాకు మాత్రమే కాదు ప్రతి ఫ్యామిలీకి పర్సనల్ సమస్యలు ఉంటాయి. నేను లైమ్ లైట్ లోకి వచ్చాను. నాకు సంబంధించిన కొన్ని సమస్యలపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ నేను పబ్లిక్ పర్సన్ కాదు. నా వ్యక్తిగత జీవితానికి, నా కుటుంబానికి సంబంధించిన విషయాలు పబ్లిక్ లోకి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు.... అని సురేష్ బాబు అన్నారు.

 ఇండస్ట్రీ సాఫ్ట్ టార్గెట్ అయింది

ఇండస్ట్రీ సాఫ్ట్ టార్గెట్ అయింది

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. ఒక డైమండ్ వ్యాపారి తప్పుచేస్తే.... అందరు వ్యాపారులను అలాగే చూస్తామా? ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అందరు రాజకీయ నాయకులను అలాగే చూస్తున్నామా? చూడటం లేదు. ఎందుకంటే అందరూ తప్పుడు మనుషులే ఉండరు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు తప్పు చేస్తే ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుగా చూడటం సరికాదు అని సురేష్ బాబు అన్నారు.

అమెరికా టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి

అమెరికా టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి

అమెరికా టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి స్పందిస్తూ... అక్కడ ఏం జరిగింది? వాడు సినిమా వాడా? కాదా? మనకు తెలియదు. మీడిాయలో సినిమా ప్రొడ్యూసర్ అని వెంటనే అనౌన్స్ చేశారు. అతడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్నారా? లేడా? అనేది ఎవరికీ తెలియదు. వెళ్లిన వారు సినిమా యాక్టర్లా? కాదా? అనేది కూడా తెలియదు. తెలియకుండానే దాన్ని డ్రమటైజ్ చేసేసి... పలు ఛానల్స్ నా దగ్గరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది అని డబ్బాలు కొట్టుకుంటున్నాయి. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. నిజంగా సమస్య ఏమిటి? అమాయకమైన అమ్మాయిలను మోసం చేస్తున్నారా? దాన్ని మనం పట్టుకుని అరికట్టాలి. ఫ్లెష్ ట్రేడ్ మన సొసైటీలో ఉందా? లేదా? అంటే ఉంది... కొన్ని గవర్నమెంట్లు యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్ని గవర్నమెంట్లు యాక్సెప్ట్ చేయడం లేదు. కొన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్నిచేయడం లేదు. అక్కడ ఉండే రూల్ ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం అది తప్పా? ఒప్పా? అని నిర్ణయించబడుతుంది అని సురేష్ బాబు వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X