twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజుకు లింకు ఉందా? మంచి పద్దతి కాదంటూ సురేష్ బాబు కామెంట్!

    నేనే రాజు నేనే మంత్రి చిత్రంపై సురేష్ బాబు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    By Bojja Kumar
    |

    ఆగస్టు 11న తెలుగులో మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. నితిన్‌ నటించిన 'లై', బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'జయ జానకి నాయక', రానా హీరోగా తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

    అయితే ఈ మూడు సినిమాలు ఒకేసారి విడుదల కావడంపై ఓ చిన్న వివాదం చోటు చేసుకున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై 'నేనే రాజు నేనే మంత్రి' నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ఇలా మూడు సినిమాలు ఒకేసారి విడుదల కావడం వల్ల లాభాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

    ఎవరూ తగ్గడం లేదు

    ఎవరూ తగ్గడం లేదు

    రిలీజ్ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి పరిణామాలు ఇండస్ట్రీకి అంత మంచిది కాదు, దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం కలుగకుండా పోతుంది. ఇలాంటి పోటీ వాతావరణం వల్ల నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు.

    Recommended Video

    Nithin's Lie " Love Intelligence Enimity" Teaser Review
    సురేష్ బాబుపై విమర్శలు?

    సురేష్ బాబుపై విమర్శలు?

    ‘నేను రాజు నేనే మంత్రి' సినిమాను మొదట ఆగస్టు 18 లేదా 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారని, ఉన్నట్టుండి ఆగస్టు 11న తేదీకి రిలీజ్ డేట్ మార్చారని ఇండస్ట్రీలో విమర్శలు వినిపిస్తున్నాయి.

    ఆగస్టు 11న ఫిక్స్ కావడానికి కారణం అదే అంటున్న సురేష్ బాబు

    ఆగస్టు 11న ఫిక్స్ కావడానికి కారణం అదే అంటున్న సురేష్ బాబు

    తమిళంలో అజిత్ కొత్త చిత్రం విడుదల 11వ తేదీన ఉంటే, తాను ఈ చిత్రాన్ని రెండు వారాల పాటు వాయిదా వేసి ఉండేవాడినని సురేష్ బాబు అన్నారు. అయినా తమ చిత్రం విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి వచ్చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

    దిల్ రాజకు లింక్ ఉందా?

    దిల్ రాజకు లింక్ ఉందా?

    సురేష్ బాబు తన కొడుకు నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి' చిత్రాన్నితన ఇన్‌ఫ్లూయెన్స్ అంతా ఉపయోగించి వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే ‘లై', ‘జయ జానకి నాయక' చిత్రాలకు బ్యాక్ సైడ్ నుండి రిలీజ్ పరంగా దిల్ రాజు సపోర్టు ఇస్తున్నారని, తన చేతిలో ఉన్న థియేటర్లను వీటికి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

    ఢీ అంటే ఢీ

    ఢీ అంటే ఢీ

    అయితే ఆగస్టు 11నే ఈ ముగ్గురు రిలీజ్ డేట్ ఫిక్స్ కావడానికి ప్రధాన కారణం ఉంది. ఆగస్టు 11న సినిమా రిలీజ్ చేస్తే 12, 13 తేదీల్లో వీకెండ్ హాలిడేస్, 14వ తేదీ కృష్ణజన్మాష్టమి, 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సంవం హాలిడేస్ వస్తున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని, మంచి కలెక్షన్లు వస్తాయనే ఉద్దేశ్యంతోనే ఇదే రోజున ఎంత పోటీ ఉన్నా ఢీ అంటే ఢీ అంటూ రిలీజ్ బరిలో దూకారు.

    ఫుల్ కాన్పిడెన్సులో సురేష్ బాబు

    ఫుల్ కాన్పిడెన్సులో సురేష్ బాబు

    ‘నేను రాజు నేనే మంత్రి' సినిమాపై సురేష్ బాబు ఫుల్ ఫుల్ కాన్ఫిడెన్సుతో ఉ న్నారు. ఇది ఓ క్లాసికల్ మూవీలా అనిపించిందని, కొన్ని సన్నివేశాల్లో తనకు కళ్లవెంట నీళ్లొచ్చాయని అన్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

    English summary
    Suresh Babu showing confidence about 'Nene Raju Nene Mantri' release. He expressed hope that the film would be a big hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X