twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ ఎంతో సాధించాడు.. హీరోలందరికీ అది కామన్.. నెపోటిజంపై సురేష్ బాబు కామెంట్స్

    |

    టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు నెపోటిజం, సుశాంత్ మృతిపై తాజాగా స్పందించాడు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఇటీవలె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. అయితే అది కచ్చితంగా హత్యేనని, బాలీవుడ్ మాఫియా, నెపోటిజం వంటి కారణాల వల్లే ఇలాంటి ఘటన జరిగిందని, సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Sushant ఎంతో సాధించాడు.. హీరోలందరికీ అది కామన్.. - Suresh Babu

    అయితే తాజాగా సురేష్ బాబు తాను నిర్మించిన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా సక్సెస్ అయిన సందర్భంలో మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో అనేక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. అవేంటో ఓసారి చూద్దాం.

    ప్రస్తుత ప్రాజెక్ట్‌లు..

    ప్రస్తుత ప్రాజెక్ట్‌లు..

    సురేష్ ప్రొడక్షన్స్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ల గురించి సురేష్ బాబు అనే విషయాలు తెలిపాడు. రవిబాబు దర్శకత్వంలో ‘క్రష్‌' సినిమా నిర్మిస్తున్నాం. ఓ నాలుగు పాటలు మాత్రమే బ్యాలెన్స్‌ షూట్‌ ఉంది. అది 25 మందితో షూట్‌ చేయటానికి రవిబాబు ప్లాన్‌ చేస్తున్నాడని, అందుకని ఈ సినిమాని పూర్తి చేసేస్తామని అన్నాడు. ‘నారప్ప', ‘విరాటపర్వం' సినిమాల షూటింగ్‌ ఇప్పట్లో మొదలుపెట్టలేమని, ‘హిరణ్యకశ్యప' మూవీని చాలా పెద్ద స్కేల్లో చేస్తామని తెలిపాడు.

    రానా పెళ్లిపై..

    రానా పెళ్లిపై..

    రానా మిహికల వివాహం ఆగస్టులో జరగబోతోందని అందరికీ తెలిసిందే. ఈ విషయమై సురేష్ బాబు మాట్లాడుతూ.. మామూలు టైమ్‌లో అయితే ఈపాటికి కార్డులు పంచేవాళ్లమని, షాపింగ్, పెళ్లి పనులు ఉండేవని తెలిపాడు. ఇప్పుడు ప్రభుత్వం ఎంతమందితో చేసుకోమంటే అంతమందితో చేసుకోవాలి కదా.. అందుకే పెద్ద పనులేమీ లేవని చెప్పుకొచ్చాడు.

    నెపోటిజంపై..

    నెపోటిజంపై..

    సుశాంత్ మరణం, బంధుప్రీతిపై సురేష్ బాబు మాట్లాడుతూ.. నెపోటిజమ్‌ టాపిక్‌ను సమర్థించను, విమర్శించనని తెలిపాడు. కారణం ఏంటంటే ఎంతోమంది దర్శకుల, నిర్మాతల, హీరోల పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నిరూపించుకోలేకపోయారని గుర్తు చేశాడు. స్టార్స్‌ ఇళ్లల్లోనుండి పుట్టరని, ఆడియన్స్‌ ఆమోదంతో స్టార్స్‌ అవుతారని చెప్పుకొచ్చాడు.

    సుశాంత్ ఎంతో సాధించాడు..

    సుశాంత్ ఎంతో సాధించాడు..

    సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గురించి సురేష్ బాబు చెబుతూ.. నటుడిగా చాలా సాధించాడని చెప్పుకొచ్చాడు. స్టార్‌ నుండి సూపర్‌ స్టార్‌గా మారే దశలో ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోవడం బాధ అనిపించిందని తెలిపాడు. ఉదాహరణకు మన హీరోలనే తీసుకోంటూ రవితేజ, నాని, రాజ్‌ తరుణ్‌.. ఇలా ఎంతోమంది వచ్చారని, అందరి హీరోలకు గుడ్‌టైమ్, బ్యాడ్‌టైమ్‌ అనేది ఉంటుందని తెలిపాడు. తాను చెన్నైలో ఉన్నప్పుడు క్రికెట్‌ చాలా బాగా ఆడేవాణ్ని అని అప్పుడు తనను టీమ్‌లో సెలక్ట్‌ చేయలేదని గతాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తాను డిప్రెషన్‌ ఫీలయితే ఎలా? ఏదేమైనా మనం ట్రై చేస్తూనే ఉండాలని, అదే జీవితమని చెప్పుకొచ్చాడు.

    English summary
    Suresh Babu Comments On Sushant Singh Suicide And Nepotism. suresh babu Says that stars are Not Made From Homes. If Audience Accepts Then Only Becomes Stars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X