మహేష్ - త్రివిక్రమ్- పవన్ స్కిట్ గురించి సురేష్ బాబు

By Bojja Kumar

హైదరాబాద్: ఈ నెల 30 జరిగే ‘మేము సైతం' కార్యక్రమం గురించి తెలుగు సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హుధూద్ తుఫాన్ బాధితుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల కార్యక్రమాలు ఎన్ని ఉన్నా.....అందరూ ఓ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Suresh Babu Confirms Mahesh Babu - Trivikram - Pawan Kalyan Skit

అది మరేదో కాదు.....మహేష్ బాబు, త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ కలిసి చేసే స్కిట్ కోసం. అసలు వీరిలో ఏ ఒక్కరు స్కిట్ చేసినా అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. అలాంటిది ముగ్గురు కలిసి స్కిట్ చేస్తే టాప్ లేచి పోవాల్సిందే. సోమవారం జరిగిన మేము సైతం ప్రెస్ మీట్లో నిర్మాత సురేష్ బాబు ఈ స్కిట్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.

పవన్, త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి ఓ స్కిట్ చేస్తారు. అదే విధంగా ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి కలిసి మరో స్కిట్ చేస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ రెండు టీములుగా విడిపోయి కబడ్డీ ఆడుతున్నారు అని సురేష్ బాబు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X