రాజమౌళి 'ఈగ' రిలీజ్ డేట్ ప్రకటన
రాజమౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ఈగ' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 31న విడుదల చేయాలని భావిస్తున్నామని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు మీడియాకు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతు ఈ విషయాన్ని చెప్పారు. అలాగే బాలల కోసం ప్రత్యేకంగా చిత్రాలు నిర్మించాలని భావిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రానా హిందీ సినిమా 'డిపార్ట్‌మెంట్', వెంకటేష్ 'బాడీగార్డు' సినిమా షూటింగ్స్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఈగ' విషయానికి వస్తే.. సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ" గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై.. అదీ ఓ పరమ క్రూరుడిపై ఆ 'ఈగ" ఎలా గెలిచిందీ.. ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.


Click it and Unblock the Notifications











