అశ్వనీదత్ నిర్మాతగా గమ్యం ఫేమ్ క్రిష్ దర్శకత్వంలో కృష్ణం వందే జగత్గురుమ్ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ హీరోగా చేస్తున్న ఈ సినిమాని ఇప్పుడు సురేష్ బాబు సమర్పించటానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం సురేష్ బాబు,అశ్వనీదత్ తొలిసారిగా కలిసి పనిచేయనున్నారు. అలాగే త్వరలో ప్రారంభం కాబోయే ఈ సినిమాలో వెంకటేష్ ఓ రెండు సన్నివేశాల్లో కృష్ణుడుగా కనపడతారని రూమర్స్ వినపడుతున్నాయి. క్రిష్ చెప్పిన దాని ప్రకారం సినిమా పూర్తి స్ధాయి ఎంటర్ టైన్మైంట్ గా ఉంటూనే ఫిలాసఫికల్ టచ్ ఉంటుందిట.