యాక్సిడెంట్ వెనుక అసలు కథ .. వాళ్ళ ఇంట్లో నా ఫోటో పెట్టుకున్నారు.. సురేష్ బాబు!
ఇటీవల సురేష్ బాబు యాక్సిడెంట్ చేసారు అంటూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ప్రసారం అయ్యాయి. సురేష్ బాబు తన వాహనంతో మరో వాహనాన్ని గుద్దేశారని, అవతలి వాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కారు డ్రైవ్ చేసింది సురేష్ బాబే అని కొందరు అంటే.. కాదు ఆయన డ్రైవర్ అని మరికొందరు అన్నారు. ఆ సమయంలో సురేష్ బాబు అసలు అక్కడ లేరని మరికొందరు చెప్పుకొచ్చారు. ఆ యాక్సిడెంట్ వివరాలన్నీ తాజాగా సురేష్ బాబు వివరించారు.

చాలా పెద్ద కథ జరిగింది
ప్రమాదం జరగక ముందు చాలా పెద్ద కథ జరిగిందని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. జరుగుతున్న వదంతులన్నింటికీ సురేష్ బాబు నేడు మీడియాకు క్లారిటీ ఇచ్చారు. కొంపల్లిలో తన స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కు హాజరు కావాల్సి ఉంది. కానీ నేను అత్తాపూర్ థియేటర్ కు వెళ్లి ఓ సినిమా చూస్తున్నా.

సినిమా చూస్తున్నా అంటే బాగోదని
సినిమా చూస్తుండగా నా స్నేహితుడు ఫోన్ చేశాడు. ఫంక్షన్ కు వస్తున్నావా అని అడిగాడు. ఫంక్షన్ ఎగ్గొట్టి సినిమా చూస్తున్నా అంటే బాగోదు. వెంటనే కారు తీసుకుని కొంపల్లి బయలుదేరా. ఫంక్షన్ ముగించుకుని తిరిగి వస్తుండగా సికింద్రాబాద్ లో ఈ ప్రమాదం జరిగింది.

ఆ రోజు నా తలరాత అలా ఉంది
తన తలరాత వల్లే ఈ ప్రమాదం జరిగిందని సురేష్ బాబు అన్నారు. కారు పెద్ద రాయిని ఎక్కడంతో టైర్ పగిలియింది. వెంటనే కారు అదుపు తప్పి పక్కనే ఉన్న వాహనాన్ని గుద్దిందని సురేష్ బాబు తెలిపారు.

పోలీస్ స్టేషన్‌కు నేనే వెళ్ళా
వెంటనే గాయపడ్డ ఆసుపత్రికి తరలించి పూర్తి వైద్యం ఖర్చులు నేనే భరించా అని సురేష్ బాబు తెలిపారు. నేరుగా నేనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించుకున్నా. నేను మద్యం తగలేదని పోలీసులు తెలుసుకున్నారు. ఇద్దరికీ అయిన గాయాలు చిన్నవే. మరొకరికి పెద్ద గాయం అయింది. ఫియోజి థెరపీ కూడా చేయిస్తున్నా అని సురేష్ బాబు అన్నారు.

వాళ్ళ ఇంట్లో నా ఫోటో
వారికీ అవసరమైనవి అన్ని నేను సమకూరుస్తున్నా, దగ్గరుండి చూసుకుంటున్నా. నా ఫోటోని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు అని సురేష్ బాబు అన్నారు. ఆరోజు అత్తాపూర్ లో సినిమా చూడడానికి కారణం ఉంది. ఆ సినిమా బావుంది అని అన్నారు. రీమేక్ హక్కులు తీసుకుందాం అనే ఉద్దేశంతోనే ఆ చిత్రాన్ని చూసినట్లు సురేష్ బాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











