ప్రపంచస్థాయిలో రానా హిరణ్యకశిపుడు.. సంచలన విషయం బయటపెట్టిన సురేష్ బాబు!

సినీ అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా అన్ని రకాల పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. బాహుబలి చిత్రంలో బల్లాలదేవుడిగా రానా చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ పాత్రతో తాను పౌరాణిక పాత్రలకు కూడా సరిపోతానని రానా సంకేతాలు పంపాడు. రానా ఆహార్యం అందుకు తగ్గట్లుగా ఉంటుంది. ప్రేక్షకుల మెప్పు పొందేందుకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటారు. గుణశేఖర్, రానా కాంబినేషన్లో పౌరాణిక చిత్రం హిరణ్యకశిపుడు అదిరిపోయే విషయాలు బయటకు వచ్చాయి.

గుణశేఖర్ ప్రతిభ

గుణశేఖర్ ప్రతిభ

దర్శకుడు గుణశేఖర్ ప్రతిభ పాటవాల గురించి తక్కువ అంచనా వేయలేం. గుణశేఖర్ తెరకెక్కించిన గత చిత్రాలే ఇందుకు నిదర్శనం. లిమిటెడ్ బడ్జెట్ లో రూపొందిన రుద్రమ దేవి చిత్రాన్ని మంచి క్వాలిటీతో తెరకెక్కించారు. ఈ నమ్మకంతోనే రానా హిరణ్యకశిపుడు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చాలా రోజులుగా కసరత్తు

చాలా రోజులుగా కసరత్తు

రుద్రమదేవి చిత్రం తరువాత గుణశేఖర్ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. రుద్రమ దేవి చిత్రం 2015 లో విడుదలయింది. అప్పటి నుంచి హిరణ్యకశిపుడు చిత్రం గురించి మెరుపులా వార్తలు వచ్చి మాయం అయిపోతున్నాయి కానీ క్లారిటీ రావడం లేదు. ఈ చిత్రం వెనుక భారీ కసరత్తు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎట్టకేలకు క్లారిటీ

ఎట్టకేలకు క్లారిటీ

అదుగో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నిర్మాత సురేష్ బాబు హిరణ్యకశిపుడు చిత్రం గురించి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంబందించిన వర్క్ అటు గుణశేఖర్ ఆఫీస్ లో, రామానాయుడు స్టూడియో భారీ కసరత్తే జరుగుతోందని సురేష్ బాబు అన్నారు.

ప్రపంచస్థాయిలో

ప్రపంచస్థాయిలో

ఈ చిత్రాన్ని ప్రపంచస్థాయి నిర్మాణ విలువలు, క్వాలిటీతో తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని సురేష్ బాబు అన్నారు. అందు వల్లనే ఎక్కువ సమయం పడుతోందని సురేష్ బాబు అన్నారు. ఈ చిత్ర గ్రాఫిక్స్ కు సంబంధించి లండన్ లో కూడా వర్క్ జరుగుతోందని సురేష్ బాబు షాకింగ్ విషయాలు వెల్లడించారు.

చాలా ఆసక్తిగా రానా

చాలా ఆసక్తిగా రానా

హిరణ్యకశిపుడు చిత్రంపై రానా చాలా ఆసక్తిగా ఉన్నాడు. రానాపై పురాణాలు, నవలల ప్రభావం ఎక్కువ. భారీ మార్కెట్ కోసం మల్టిలాంగ్వేజ్ చిత్రంగా దీనిని నిర్మిస్తామని సురేష్ బాబు తెలిపారు. త్వరలో ఈ చిత్ర ప్రారంభం గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రానా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X