twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా అన్యాయం చేస్తున్నారు.. నేనైతే ఎవరినీ కేర్ చేయను.. టికెట్ రేట్ల గురించి సురేష్ బాబు సంచలనం!

    |

    ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్య‌వ‌హారం విష‌యంలో సీనియర్ నిర్మాత డి.సురేష్ బాబు సంచలన వ్యాఖ్య‌లు చేశారు. సురేష్ బాబు కరోనా బారిన పడినందున దృశ్యం 2 ప్రీ-రిలీజ్ ప్రమోషన్‌ల విషయంలో బయటకు రాలేదు. దీంతో ఆయన కోలుకున్న తర్వాత ఈ రోజు మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సమయంలో ఆయన సినిమా పరిశ్రమ భవిష్యత్తు మొదలు పరిశ్రమ పట్ల ప్రభుత్వాల వైఖరి వరకు అనేక సమస్యల గురించి మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే

     నేను డబ్బును పోగొట్టుకో

    నేను డబ్బును పోగొట్టుకో

    ఈ రోజుల్లో ప్రేక్షకులు కొన్ని బాగా క్రేజ్ ఉన్న సినిమాలు చూడటానికి మాత్రమే థియేటర్లకు వస్తున్నారని, ఓకే అని, యావరేజ్ అని భావిస్తున్న సినిమాలకు చాలా కష్టకాలం అనే చెప్పాలని అనాన్రు. అందుకే ఇప్పుడు ఓటీటీ అనేది ఒక ఉత్తమ ఎంపిక అని ఆయన అన్నారు. నా దగ్గర మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయన్న ఆయన అవన్నీ OTT కోసమేనని అన్నారు. నేను ఎవరిని పట్టించుకోను. ఇతరులు ఏమనుకుంటారో అని భయపడి నేను డబ్బును పోగొట్టుకోను. కానీ నేను పరిశ్రమను అందరి కంటే ఎక్కువ పట్టించుకుంటాను, "అని ఆయన చెప్పారు. ఇక కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమకు చాలా అన్యాయం చేస్తున్నాయన్న ఆయన . పదిహేను నెలలుగా భయంకరమైన పరిస్థితులు చూశామని అప్పుడు ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు.

    చాలా అన్యాయం చేస్తున్నారు

    చాలా అన్యాయం చేస్తున్నారు

    అయితే ఏపీ ప్రభుత్వం కనీస విద్యుత్ డిమాండ్ ఛార్జీల కోసం మూడు నెలల మాఫీని ప్రకటించింది కానీ ఆ జీవో ఇంకా రాలేదన్నారు.. తెలంగాణలో కూడా అలాగే ఉందని సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇండిపెండెంట్ థియేటర్ యజమానుల గురించి నేను చాలా బాధపడ్డానన్న ఆయన ప్రభుత్వాలు తక్కువ ధరలకు టిక్కెట్లు అమ్మడం వల్ల ప్రజల్లో తమ ఆదరణ పెరుగుతుందని భావించవచ్చు. కానీ వారు థియేటర్లకు ముఖ్యంగా B&C సెంటర్ల కి చాలా అన్యాయం చేస్తున్నారన్నారు.

    ఎవరూ సహాయం చేయలేదు

    ఎవరూ సహాయం చేయలేదు

    2000లో ఏపీ, తెలంగాణల్లో 2900 థియేటర్లు ఉండేవన్న ఆయన ఇప్పుడు అవి 1, 750కి తగ్గాయని, కొత్త రేట్లతో అవి మరింత దిగజారిపోతాయి" అని ఆయన చెప్పారు. థియేటర్ యజమాని జీతాలు చెల్లించాలి, దాని పైన, కనీస విద్యుత్ డిమాండ్ ఛార్జీలు మరియు ఆస్తి పన్నులు చెల్లించాలన్నారు. మేము అన్ని ప్రభుత్వాలను సంప్రదించాము, కానీ ఎవరూ సహాయం చేయలేదు.

    నాకు తెలియదు

    నాకు తెలియదు


    వాళ్ళు ఉదాసీనంగా ఉన్నారో, కమ్యూనికేషన్‌లో సమస్య వచ్చిందో నాకు తెలియదు అని సురేష్ బాబు అన్నారు. ''ఇండస్ట్రీని హైదరాబాద్‌కి రమ్మని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు పెట్టిన సమావేశంలో నేను ఉన్నానన్నా ఆయన పన్ను రాయితీలు ఇస్తే ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని అధికారులు ఆయనకు చెబుతుంటే ఆర్థిక విషయాల గురించి ఆలోచించవద్దని, హైదరాబాద్‌ను తెలుగు సినిమాకు బేస్ గా మారే పెద్ద అవకాశాన్ని చూడాలని వెంటనే వారికి చెప్పారు అని సురేష్ బాబు బాబు వెల్లడించారు.

    సినిమాకు బేస్

    సినిమాకు బేస్

    "ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తే, హైదరాబాద్ భారతీయ సినిమాకు బేస్ అవుతుందని, బహుశా కేటీఆర్‌కు ఆ ప్లాన్‌ ఉందని నమ్ముతున్నానన్నారు. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం సినిమాలకు రెడ్ కార్పెట్ పరుస్తోందని మన ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. "మార్కెట్లో ఒకొక్క వ‌స్తువుకీ ఒక్కో రేటు ఉంటుంది. అన్ని వ‌స్తువుల్ని క‌లిపి ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా? సినిమా కూడా అంతేనని ఆయన అన్నారు.

     స‌మంజ‌సం కాదు

    స‌మంజ‌సం కాదు

    పెద్ద సినిమాల బ‌డ్జెట్ వేరు. చిన్న సినిమాల బ‌డ్జెట్ వేరు. రెండు సినిమాల‌కూ ఒకే రేటు నిర్ణ‌యించడం స‌మంజ‌సం కాదు. ఇలాగైతే పెద్ద సినిమాలు భారీగా న‌ష్ట‌పోతాయన్నారు. ఏమైనా అంటే బ్లాక్ టికెట్ వ్య‌వ‌స్థ అంటున్నారు కదా బ్లాక్ టికెట్ వ్య‌వ‌స్థ‌.. రెండు మూడు రోజులు ఉంటుందేమో..? ఆ త‌ర‌వాత‌.. టికెట్ మామూలు రేటుకే అమ్ముతారు. తిప్పి కొడితే.. వెయ్యి కోట్ల ప‌రిశ్ర‌మ కాదిది. దానిపై ఇన్ని ఆంక్ష‌లేంటో అర్థం కావ‌డం లేదన్నారు.


    English summary
    Suresh Babu made sensational comments on the ap cinema ticket pricing issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X