రానా దగ్గుబాటి గత రాత్రి ఎవరితో గడిపాడు? సురేష్‌బాబు సీరియస్!

By Rajababu

Recommended Video

Filmfare Awards South 2018 Event Highlights

దక్షిణ భారతీయ సినిమా పరిశ్రమలో 2018లో ఉత్తమ ప్రతిభ చూపి చిత్రాలకు, నటీనటులకు ఫిలింఫేర్ ఇటీవల అవార్డులను ప్రధానం చేసింది. దక్షిణాది సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, హీరో సందీప్ కిషన్, హీరోయిన్ ఇషా రెబ్బా హోస్ట్‌లుగా వ్యవహరించారు. జియో స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ అవార్డుల కార్యక్రమం ఆదివారం టెలివిజన్‌లో ప్రసారమైంది. ఆ కార్యక్రమంలోని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం..

బాహుబలి2కి అవార్డుల పంట

బాహుబలి2కి అవార్డుల పంట

2018 సంవత్సరంలో బాహుబలి2 చిత్రం అవార్డుల పంట పండించింది. ఉత్తమ చిత్రంగా బాహుబలి2, ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ సహాయనటుడిగా రానా దగ్గుబాటి, ఉత్తమ సహాయనటిగా రమ్యకృష్ణ, ఉత్తమ సంగీత దర్శకుడిగా, గేయ రచయితగా కీరవాణి అవార్డులను అందుకొన్నారు.

రానాను ఆటపట్టించిన

తన అవార్డును అందుకునే సమయంలో రానా దగ్గుబాటిని రాహుల్ రవీంద్రన్, సందీప్ కిషన్ ఆటపట్టించారు. జియో భవిష్యవాణికి ఫోన్ చేసి.. రానాకు పెళ్లి ఎందుకు కావడం లేదని, అలాగే గత రాత్రి రానా ఎవరితో గడిపారో చెప్పండి అంటూ ప్రశ్నలు సంధించారు.

గంభీరంగా సురేష్‌బాబు

గంభీరంగా సురేష్‌బాబు

గత రాత్రి రానా ఎవరితో గడిపాడనే ప్రశ్న అడిగినప్పుడు వేదిక ముందున్న ప్రముఖులందరూ సైలెంట్ అయ్యారు. వేదిక ముందు కూర్చుని ఉన్న సురేష్ బాబు గంభీరంగా మారిపోయారు. ఏం జరుగబోతున్నదనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

షాక్ నుంచి రానా తేరుకొని

షాక్ నుంచి రానా తేరుకొని

ఆ సమయంలో పరిస్థితి చేజారుతున్నదని గమనించిన రానా ఆ తర్వాత షాక్ నుంచి తేరుకొన్నారు. ఈ రాత్రికి మాత్రం ఫిలింఫేర్‌ వేడుకలో ఉన్నాను అని చెప్పడంతో రానా పరిస్థితి దారిలోకి వచ్చింది. సందీప్ కిషన్, రాహుల్‌ను ఓ చూపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 ఉత్తమ నటీనటులుగా విజయ్, సాయిపల్లవి

ఉత్తమ నటీనటులుగా విజయ్, సాయిపల్లవి

ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా అర్జున్ రెడ్డి చిత్రానికి విజయ్ దేవరకొండ, ఉత్తమ నటిగా ఫిదా చిత్రానికి సాయిపల్లవి అవార్డులను అందుకొన్నారు. అవార్డు అందుకునే సమయంలో విజయ్ దేవరకొండ తల్లి ఉద్వేగానికి లోనయ్యారు.

అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ

తనకు వచ్చిన ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన మొత్తాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తాను అని విజయ్ చెప్పారు. ఉత్తమ నటి అవార్డును అందుకొన్న తర్వాత సాయిపల్లవికి ఉద్వేగంగా ప్రసంగించారు. నటిగా ఈ అవార్డును అందుకోవడానికి కారణం నా తల్లి అని అన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల లేకపోతే ఇది సాధ్యపడేది కాదు అని ఆమె పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X