రానా లుక్ చూసి షాకయ్యా, నేనుకూడా గుర్తుపట్టలేక పోయా: సురేష్ బాబు

By Bojja Kumar

ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటుడు రానా... ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. గతంలో బాహుబలి కోసం భారీగా కండలు పెంచిన రానా... చంద్రబాబు నాయుడు పాత్రలో పర్ఫెక్టుగా సూటవ్వడానికి భారీగా బరువుతగ్గిపోయాడు.

అచ్చం చంద్రబాబును తలపించేలా రానా లుక్ ఒకటి ఇటీల విడుదలవ్వగా అభిమానులంతా షాకయ్యారు. రానా లుక్ ఇంత పర్ఫెక్టుగా సూటవుతుందని ఎవరూ ఊహించలేదు. చాలా మంది ఈ లుక్, అతడి స్టైల్ చూసి ఇది రానా? చంద్రబాబా? అని కొంతసేపు అయోమయానికి గురయ్యారు.

Suresh Babu shocked by Ranas NTR Biopic look

రానా తండ్రి, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు కూడా అతడి లుక్ చూసి ఇలాంటి ఆశ్చర్యానికే గురయ్యారు. ''రానా లుక్ చూసి షాకయ్యాను. మా స్టూడియోలో అచ్చం చంద్రబాబు నాయుడిగా స్టిల్ ఇస్తూ నించున్నాడు. నేను గుర్తు పట్టలేకపోయాను. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఈ పాత్ర మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది.'' అని సురేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కాగా... ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ జాగర్లమూడి సినిమాలోని పాత్రల మేకోవర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. బయోపిక్ చిత్రాలు ప్రేక్షకులకు రీచ్ కావాలంటే అందులోని పాత్రల మేకోవర్ కూడా ఎంతో కీలకం.

ఇటీవల విడుదలైన బాలయ్య లుక్ కూడా అచ్చం ఎన్టీఆర్‌ను పోలి ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇవే సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రతో పాటు ఆయన జీవితంలోని సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అవరసమైన మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పాత్రలను కూడా చూపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X