ఎఫైర్ల గురించి తెలుగు నిర్మాత డి సురేష్ బాబు కామెంట్!

By Bojja Kumar

Suresh Babu speaks about Affairs with Heroines
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గురించి కొత్తగా పరిచయం లేదనుకుంటా. 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' అనే టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబు......తన గురించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయనకు ఎఫైర్ల గురించిన ప్రశ్న ఎదురైంది.

ఇందుకు ఆయన సమాధానం ఇస్తూ....సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే క్రమ శిక్షణ ఎంతో అవసరమని....మందు, మగువకు దూరంగా ఉండాలని తన కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుండి చెప్పే వారని, వారి మాటలు తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు.

కాలేజీ రోజుల నుండి సినిమా ఇండస్ట్రీ వరకు ఎంతో మంది అమ్మాయిలు తనను ఆకర్షించడానికి ప్రయత్నించారని....క్రమ శిక్షణతో ఉండటం వల్లనే ఎలాంటి అట్రాక్షన్‌కు లొంగకుండా ఉండగలిగానని సురేష్ బాబు తెలిపారు. క్రమ శిక్షణలేని వారు పరిశ్రమలో నిలదొక్కున్న దాఖలాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు.

తన తండ్రి డి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ సినీ నిర్మాణ సంస్థను, డి రామానాయుడు స్టూడియో బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్న సురేష్ బాబు తెలుగు సినిమా సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తనయుడు రానా ప్రస్తుతం పరిశ్రమలో హీరోగా నొలదొక్కుకునే ప్రయత్నంచేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X