ట్రెండ్ మారింది: ఆ స్టార్ హీరో కూతురు కూడా...?
హైదరాబాద్: హీరోల సినీరంగ వారసత్వాన్ని స్వీకరించడంలో కుమారులే ముందుండే వారు. కానీ ఇదంతా గతం. ట్రెండు మారింది. ఇపుడు హీరోల కుమార్తెలు కూడా ఈ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ కూతురు, అర్జున్, శరత్ కుమార్ కూతుర్లు ఈ రంగంలోకి దిగారు.
తాజాగా మరో స్టార్ హీరో అయిన సురేష్ గోపీ కూతురు భాగ్య కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. అయితే నటిగానో, దర్శకురాలుగానో కాకుండా సింగర్‌గా అవతారం ఎత్తింది. కేవలం సింగర్‌గానే కాకుండా పాటలు రాస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

త్వరలో రాబోతున్న మళయాల సినిమా ‘Jo We Lo'కు ఇంగ్లీష్ పాట రాసింది. ఈ చిత్రానికి శ్యాం ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. తనకు చిన్న తనం నుండి పాటలు రాయడంతో పాటు, కంపోజ్ చేసే అలవాటు ఉందని...కొందరు స్నేహితులకు మాత్రమే ఈ విషయం తెలుసని ఆమె తెలిపారు.
తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తనలోని టాలెంటును ప్రోత్సహిస్తూ వెన్నుతట్టుతున్నారని.....వారి సహకారంతో తన శక్తిమేర రాణించడానికి ప్రయత్నిస్తాను అంటోంది భాగ్య. మరి ఆమెకు బెస్టాఫ్ లుక్ చెబుదాం.


Click it and Unblock the Notifications











