బూతు కామెడీలో హన్సిక,అంజలి
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ''వినోద ప్రధానంగా సాగే చిత్రమిది. ఇద్దరు అల్లరి కుర్రాళ్లు చేసే సందడి కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. తమిళంలో ఇటీవలే సెన్సార్ పూర్తయింది. అక్కడ ఈ చిత్రానికి యు సర్టిఫికేట్ లభించింది. అంజలి హీరోయిన్ గా నటించిన 'షాపింగ్‌మాల్', 'జర్నీ' చిత్రాలు మా సంస్థ నుంచే విడుదలయ్యాయి. మరోసారి ఆమె నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. త్వరలోనే పేరును నిర్ణయిస్తాము''అన్నారు.
ఇక 'సేట్త్టె' ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించటం ఖాయమని ఆ చిత్ర హీరో ఆర్య అన్నారు. హిందీలో విజయం సాధించిన 'ఢిల్లీబెల్లీ' ఆధారంగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఆర్యకు జంటగా అంజలి, హన్సిక నటించారు. ప్రేమ్‌జీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 5న విడుదల కానుండగా చిత్ర యూనిట్ ఇటీవల మీడియాతో ముచ్చటించింది.
ఈ సందర్భంగా ఆర్య మాట్లాడుతూ.. '' ప్రేక్షకులు ప్రస్తుతం కామెడీ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. ఆ కోవలో మా చిత్రం ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందింస్తుంది. తొలిసారిగా హన్సిక, అంజలితో కలిసి నటించాను. వారిద్దరు ఎంతో చక్కగా కలిసిపోయారు'అని పేర్కొన్నారు. సంగీతం: తమన్, సహనిర్మాత: సమన్యరెడ్డి, సమర్పణ: కె.వి.శ్రీధర్‌రెడ్డి.


Click it and Unblock the Notifications












