మురుగదాస్ 'రెండు జంటల ప్రేమకథ'

By Srikanya

గజని దర్శకుడు మురుగదాస్ ఇప్పుడు మరో ప్రేమ కథతో ముందుకొస్తున్నాడు. అయితే అది ఆయన డైరక్ట్ చేయటం లేదు. ఆయన శిష్యుడు ఎం.శరవణన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శర్వానంద్, అనన్య, జై, అంజలి ఇందులో ప్రధాన పాత్రధారులు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా గురించి సురేష్ మాట్లాడుతూ మురుగదాస్ ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు జంటల మధ్య సాగే ప్రేమ కథతో ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రెండు జంటల కథలు విడివిడిగా సాగినా, ముగింపులో మాత్రం కథలకు లింకు ఉంటుంది. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రానికి బలమైన కథా కథనం తోడై మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

కోలీవుడ్‌లో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా అనువాద హక్కుల కోసం పలువురు తెలుగు నిర్మాతలు భారీ ఎత్తున పోటీపడ్డారు. చివరకు ఈ చిత్రాన్ని నేను దక్కించుకున్నాను. మా సంస్థ నుంచి గతంలో వచ్చిన ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, నాన్న చిత్రాల్లాగే ఇది కూడా విజయం సాధిస్తుంది. సత్య సంగీత దర్శకుడు. ఇందులో సన్నివేశాలే కాదు. పాటలు కూడా హృదయాలను తాకుతాయి. త్రీకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో, ఎస్.పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అన్నారు. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా 'సెవెన్త్‌సెన్స్" చిత్రం రూపొంది విడుదలకు రెడీ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X