‘ప్రేమిస్తే’ కాంబినేషన్‌తో లింగుస్వామి చిత్రం
ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాతగా బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కాదల్. ఈచిత్రాన్ని తెలుగులో 'ప్రేమిస్తే"గా విడుదల చేశారు నిర్మాత సురేష్ కొండేటి. తమిళంలో ఆనందం, రన్, జి, సండై కోళి(పందెం కోడి), పయ్య(ఆవారా), వెట్టై వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సంచలన దర్శకుడు లింగుస్వామి.
ప్రేమిస్తే కాంబినేషన్‌తో దర్శకుడు లింగుస్వామి చేతులు కలిపారు. లింగు స్వామి సమర్పణలో రూపొందుతున్న తమిళ చిత్రం 'వళక్కు ఎన్: 18/19". యూటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్స్ మీడియా ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రేమిస్తు, షాపింగ్ మాల్, నాన్న, జర్నీ, రేణిగుంట వంటి విజయవంతమైన డబ్బింగ్ చిత్రాలను తెలుగు వారిక అందించిన నిర్మాత సురేష్ కొండేటి... 'వళక్కు ఎన్: 18/19" చిత్రం తెలుగు హక్కులు దక్కించుకున్నారు. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ విషయమై నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ...'వళక్కు ఎన్ : 18/19" చిత్రం తెలుగు హక్కులు మా ఎస్.కె పిక్చర్స్ అందడం ఆనందంగా ఉందన్నారు. 'వళక్కు ఎన్: 18/19" మా గత చిత్రాలకు ఏమాత్రం తీసి పోదని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ చిత్రానికి తెలుగు టైటిల్ ప్రకటిస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications











