సురేష్ కొండేటి 'షాపింగ్ మాల్' ఓపెనయ్యేది ఎప్పుడంటే...
ప్రేమిస్తే చిత్రంతో నిర్మాత అవతారం ఎత్తిన సురేష్ కొండేటి తాజా డబ్బింగ్ చిత్రం 'షాపింగ్ మాల్'. వెయిల్ వంటి ఆర్ధ్రత గలిగిన చిత్రం రూపొందించిన తమిళ దర్శకుడు వసంతబాలన్ డైరక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. మహేష్, అంజలి జంటగా నటించిన ఈ చిత్రం పాటలు చిరంజీవి చేతుల మీదుగా ఇటీవలే విడుదలయ్యాయి. ఇక చిత్రాన్ని దీపావళి సందర్భంగా వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ''ప్రేమానురాగాలు... వినోదం కలబోసి లభించే షాపింగ్‌మాల్ మా చిత్రం. సహజసిద్ధమైన భావోద్వేగాలు ప్రతిఫలిస్తాయి ఈ కథలో. పెద్ద పెద్ద దుకాణాల్లో పని చేసే సేల్స్ గాళ్స్, బాయ్స్ జీవిత నేపథ్యాల్లో సినిమా సాగుతుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభించింది. దీని మాతృక 'అంగాడి తెరు' అనే తమిళ చిత్రం. ఇది ఇండియన్ పనోరమాకి ఎంపికైంది. తప్పకుండా మన ప్రేక్షకులకీ ఈ చిత్రం నచ్చుతుంద''న్నారు. సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, విజయ్ ఆంటోని.మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సహ నిర్మాత: ఊటుకూరి నాగార్జున్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య శ్రీనివాస్ బలువు, నిర్మాత: సురేష్ కొండేటి, దర్శకత్వం: జి. వసంతబాలన్.


Click it and Unblock the Notifications











