దాసరి తిర్గి చాలా కాలం తర్వాత మేస్త్రి అనే సినిమాతో ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారనే సంగతి తెలిసింది. అయితే దర్శకుడు ఎవరు అనేది సీక్రెట్ గా ఉంచారు. ఇప్పుడది రివిల్ అయింది. భాషా వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తమిళ,తెలుగు పరిశ్రమలను ఇప్పటికీ ఫ్లాష్ బ్యాక్ పథం వైపు నడిపిస్తున్న సురేష్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించని ఈ సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ కావటం విశేషం.ఓ ప్రక్క రాష్ట్రం రాజకీయాలతో వేడిక్కెనున్న ఈ సమయంలో ఇలాంటి సినిమాతో దాసరి రావటం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ఆ సినిమాలో ఆయన ఎవరిని తూర్పారపెట్టనున్నాడో అని చెప్పుకుంటున్నారు.ఇక సురేష్ కృష్ణ అస్త్రం సినిమా తర్వాత తెలుగులో యే సినిమా చెయ్యలేదు.అలాగే హిందీలోనూ రాకీ అనే ప్లాప్ సినిమాను డైరక్ట్ చేసి ఖాళీగా ఉన్నాడు.తమిళంలో సరేసరి. దాంతో ఆయన మళ్ళీ లైమ్ లైట్ లోకి రావటానికి ఈ సినిమాను ఎంపికచేసుకున్నాడని తెలుస్తోంది.