సురేష్ ప్రొడక్షన్స్ టైటిల్ : 'నేనేం.. చిన్నపిల్లనా?'

దర్శకుడు మాట్లాడుతూ ''కుటుంబ కథకు, యువతరం మెప్పించే అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నాం. పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఓ యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో చూపిస్తున్నాము''అన్నారు. సునీల్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రంతో హిట్ కొట్టారు. మళ్లీ మరోసారి ఓ రేంజిలో విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు.
రామానాయుడు మాట్లాడుతూ ''ఇంటిల్లిపాది కలిసి హాయిగా చూసేలా ఉంటుంది. ఆకట్టుకొనే కథ కథనాలు కుదిరాయి. శ్రీలేఖ మంచి బాణీలను అందించారు''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.
సుమన్, శరత్‌బాబు, రఘుబాబు, కాశీవిశ్వనాథ్, ఎల్బీ శ్రీరామ్, అలీ, జయప్రకాష్‌రెడ్డి, జీవా, ఉత్తేజ్, ఏవీఎస్, తాగుబోతు రమేష్, అన్నపూర్ణ, సన, రజిత, రాగిణి, అనిత, ఆమని తదితరులు నటిన్నారు. ఛాయాగ్రహణం: సాబూ జేమ్స్, కళ: డి.వెంకటేశ్వరరావు, రచన: బలభద్రపాత్రుని రమణి, మాటలు: సత్యానంద్, పాటలు: అనంత శ్రీరామ్, వనమాలి, భాస్కరభట్ల.


Click it and Unblock the Notifications











