twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సురేష్‌ ప్రొడక్షన్స్‌ టైటిల్ : 'నేనేం.. చిన్నపిల్లనా?'

    By Srikanya
    |

    Suresh Production's new film title is
    హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత డా||డి.రామానాయుడు తమ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్‌, తన్వి వ్యాస్‌ జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి పి.సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 'నేనేం.. చిన్నపిల్లనా?' అనే పేరు ఖరారు చేశారు. ఈ సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''కుటుంబ కథకు, యువతరం మెప్పించే అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నాం. పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఓ యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో చూపిస్తున్నాము''అన్నారు. సునీల్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రంతో హిట్ కొట్టారు. మళ్లీ మరోసారి ఓ రేంజిలో విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు.

    రామానాయుడు మాట్లాడుతూ ''ఇంటిల్లిపాది కలిసి హాయిగా చూసేలా ఉంటుంది. ఆకట్టుకొనే కథ కథనాలు కుదిరాయి. శ్రీలేఖ మంచి బాణీలను అందించారు''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

    సుమన్‌, శరత్‌బాబు, రఘుబాబు, కాశీవిశ్వనాథ్‌, ఎల్బీ శ్రీరామ్‌, అలీ, జయప్రకాష్‌రెడ్డి, జీవా, ఉత్తేజ్‌, ఏవీఎస్‌, తాగుబోతు రమేష్‌, అన్నపూర్ణ, సన, రజిత, రాగిణి, అనిత, ఆమని తదితరులు నటిన్నారు. ఛాయాగ్రహణం: సాబూ జేమ్స్‌, కళ: డి.వెంకటేశ్వరరావు, రచన: బలభద్రపాత్రుని రమణి, మాటలు: సత్యానంద్‌, పాటలు: అనంత శ్రీరామ్‌, వనమాలి, భాస్కరభట్ల.

    English summary
    
 After doing a film like 'Oka Romantic Crime Katha' director P Sunil Kumar Reddy is bringing up another youthful entertainer with a different backdrop. That film would be produced by D Ramanaidu on the banner of Suresh Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X