సూపర్ హిట్ తమిళ సినిమా హక్కులు కొనేసిన స్టార్ ప్రొడ్యూసర్.. తెలుగు వర్షన్ రెడీగా ఉన్నా, ఎందుకలా?
డైరెక్ట్ తెలుగు సినిమాల కంటే ఎక్కువ రీమేక్ సినిమాల మీదనే దృష్టి పెడుతున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మరో హిట్ సినిమా రీమేక్ హక్కులు కొనుక్కున్నట్టు ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే

క్రైమ్ థ్రిల్లర్ 'మానాడు'
తమిళ నటుడు శింబు హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ 'మానాడు'. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ కైవసం చేసుకుంది. కానీ ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతోందని, త్వరలోనే సినిమా అనౌన్స్ కానుందనే వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో 'మానాడు' రైట్స్ మా దగ్గర ఉన్నాయంటూ సురేశ్ ప్రొడక్షన్స్ వారు లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు.

తెలుగు వెర్షన్ రిలీజ్
ఈ సినిమాను ఎవరైనా కాపీ కొట్టినట్టు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా లీగల్ నోటీసులో వార్నింగ్ ఇచ్చారు. నిజానికి 'మానాడు' చిత్రాన్ని తెలుగులో 'ది లూప్' పేరుతో డబ్ చేయాలనుకున్నారు. అయితే విడుదల సమయంలో అనుకోకుండా తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు వెర్షన్ రిలీజ్ ఆగిపోయింది. ఆ తర్వాత దీని రైట్స్ సురేశ్ ప్రొడక్షన్స్ వారు కొనుక్కున్నారు.

రికార్డుల వర్షం
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన మానాడు ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకొని రికార్డుల వర్షం కురిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ది లూప్ పేరుతో విడుదల చేయాలనుకున్నారు కానీ కుదర లేదు.

డిసెంబర్ 24 నుంచి
ఇక ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. డిసెంబర్ 24 నుంచి సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు తెలుగుతో సహా అన్ని భారతీయ భాషల రీమేక్ మరియు డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేసింది.

రానా దగ్గుబాటితో
"తమిళంలో ఘనవిజయం సాధించిన 'మానాడు' యొక్క అధికారిక రీమేక్ హక్కులను, తెలుగులో థియేట్రికల్ డబ్బింగ్ హక్కులతో పాటు, అన్ని భారతీయ భాషలలో సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది" అని ప్రకటన రాసింది. తెలుగులో 'మానాడు' సినిమాను ఎవరితో రీమేక్ చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
పరిస్థితి చూస్తుంటే రానా దగ్గుబాటితోనే తెలుగులో రీమేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వద్దనుకుంటే ఆల్ రెడీ అనువాద వెర్షన్‌ని సురేష్ బాబుకి ఉన్న థియేటర్స్‌లోనే విడుదల చేసుకుంటారని అంటున్నారు.

చేరుతుందో లేదో
సురేశ్ ప్రొడక్షన్స్.. గతేడాది 'నారప్ప' (తమిళ సినిమా అసురన్ రీమేక్), 'దృశ్యం 2' (మలయాళ చిత్రం దృశ్యం 2 రీమేక్)ను తెలుగు ప్రేక్షకుల ముందు అమెజాన్ వేదికగా తీసుకురాగా ఇప్పుడు త్వరలో 'శాకిని డాకిని' (సౌత్ కొరియన్ ఫిల్మ్ మిడ్‌నైట్ రన్నర్స్)కి రీమేక్‌గా రూపొందుతోంది. ఈ సినిమా కూడా ఆ లిస్టులో చేరుతుందో లేదో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











