»   » రామానాయుడు నిర్మాతగా 'శివ' చిత్రం

రామానాయుడు నిర్మాతగా 'శివ' చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ సంచలాన్మతక చిత్రం శివని అనుకరిస్తూ అదే రకమైన పోస్టర్స్, టైటిల్ తో(టైటిల్ లో హీరో ఫేస్ కనపడటం)...శివ అనే చిత్రాన్ని రామానాయుడునిర్మించి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పై గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించారు. అయితే ఈ సినిమా తయారైంది తెలుగులో కాదు...భోజపురి లో రూపొందించారు. అలాగే మొన్నా మధ్యన బోనీకపూర్ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో ముంబయిలో రిలీజ్ చేసారు. ఈ చిత్రం పోస్టర్ ముంబయిలో ఎక్కువగా అంటించారు. అవి దూరం నుంచి చూసిన వారకు శివ చిత్రం మళ్ళీ రిలీజ్ అన్న భ్రాంతి కలిగిస్తున్నాయ ఇక చిత్రంలో దినేష్ లాల్ యాదవ్ హీరోగా చేస్తూండగా, పక్కీ హీరోయిన్ గా చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏడు పాటలు, ఐదు ఫైట్స్, కామిడీ కలగలపిన లవ్ స్టోరీ అంటున్నారు దర్శకుడు. గోసంగి సుబ్బారావు గతంలో భోజపురిలో చిత్రాలు డైరక్ట్ చేసి హిట్టు కొట్టారు. ఆయన దర్శకత్వంలో రంభ వంటి హీరోయిన్స్ అక్కడ చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu