సురేష్ ప్రొడక్షన్స్ లో 'ముగ్గురు' మాయగాళ్లు ఎవరంటే...
మనసంతా నువ్వే వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన దర్శకుడు వియన్ ఆదిత్య తాజా చిత్రం 'ముగ్గురు'మహా మాయగాళ్లు - అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రంలో 'ముగ్గురు' మహా మాయగాళ్లు గా నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్ కనిపించనున్నారు. అలాగే వీరి సరసన రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య హీరోయిన్స్ గా చేస్తున్నారు. డా||డి.రామానాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల మలేసియాలో షూటింగ్ జరుపుకుంది.
ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''మహా మాయగాళ్లులాంటి ముగ్గురు యువకుల కథ ఇది. నేటి తరం ఆలోచనలు, జీవన శైలిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తుందని అన్నారు. నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ.. ''ఇంటిల్లిపాదీ హాయిగా చూసేలా ఉంటుందీ చిత్రం. ముగ్గురు కుర్రాళ్ల చుట్టూ కథ తిరుగుతుంది. గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టాం. త్వరలోనే మా సొంతూరు కారంచేడులో షూటింగ్ జరుపుతామని అన్నారు . ఇక శివాజీ అతిథి పాత్రలో కనిపించే ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్నారు. మాటలు: సత్యానంద్, సంగీతం: కోటి, ఛాయాగ్రహణం: జవహర్‌రెడ్డి.


Click it and Unblock the Notifications











