అనుష్కతో పెళ్లి వార్తలపై సురేష్ రైనా స్పందన
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో టీమిండియా క్రికెటర్ చాటు మాటుగా ప్రేమాయణం నడుపుతున్నాడని, ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను అనుష్క ఇప్పటికే ఖండించింది.. సురేష్ రైనాతో రొమాన్స్ రూమర్స్‌పై స్పందించిన అనుష్క శర్మ ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. నేను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని తెలిపింది. నేను ఏ ఇండియన్ క్రికెటర్ లేదా వేరే ఎవరితో డేటింగ్ చేయడం లేదని స్ఫష్టం చేసింది.
ఆసియాకప్ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన రైనా తాజాగా ఈ వార్తలపై స్పందించారు. అనుష్క శర్మతో తనకు పరిచమే లేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు. అయినా తనకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని, టెస్టు టీంలో స్థానం సంపాదించిన తర్వాత అంటే...మరో ఒకటి, రెండు సంవత్సరాల కాలం పట్టొచ్చని వెల్లడించాడు. సినిమా హీరోయిన్లను పెళ్లి చేసుకునే ఆలోచన అసలే లేదని, మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయినే చేసుకుంటానని నొక్కి వక్కానించాడు రైనా.


Click it and Unblock the Notifications












