రామ్ చరణ్ వేరే లెవెల్.. టీమిండియా మాజీ క్రికెటర్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్. మెగా కంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆయనకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.

ఇటీవలే తమిళనాడులోని ప్రముఖ యూనివర్సిటీ రామ్ చరణ్ ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. అలాగే.. ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) 15 ఎడిష‌న్‌కు గెస్ట్ ఆఫ్ హాన‌ర్ అవార్డును రామ్ చ‌ర‌ణ్ అందుకున్నారు. ఇలా వర్డల్ వైడ్ గా ఫ్యాన్ సంపాదించుకున్నారు. దీంతో గ్లోబల్ స్టార్ మారారు.

రామ్ చరణ్ కు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు మన గ్లోబల్ స్టార్ ను ఫాలో అవుతారు. అలాగే ఎంతో మంది సెలబ్రెట్సీ ఆయన యాక్టింగ్ కు ఫ్యాన్స్ గా మారారు. కాగా ఆయన సినిమాలను ఎగబడి చూస్తాననీ, ఆయన తన ఫేవరెట్ యాక్టర్ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మన చెర్రీ యాక్టింగ్ కు ఫ్యాన్ గా మారిన ఆ క్రికెటర్ ఎవరు? ఆయన అంతగా చేసిన ఆసక్తికర కామెంట్స్ ఎంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

Suresh Raina made interesting comments on global star and hero Ram Charan

ఈ క్రికెటర్ ఎవరో కాదండీ.. మన జూనియర్ థాలా, టీమిండియా క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా చరణ్. తాజాగా మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత విషయాలతో పాటుగా కేరీర్ సంబంధించిన పలు విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.

ఈ క్రమంలో గ్లోబల్ స్టార్, హీరో రామ్ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సినీనటులు సిద్ధార్థ్ కపూర్, షాహిద్ కపూర్, సూర్యతో పాటుగా రామ్ చరణ్ అంటే కూడా చాలా ఇష్టమనీ, రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుందనీ, ఆయన అద్భుతమైన నటుడని కితాబు ఇచ్చారు రైనా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే.. గోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ 'గేమ్ చేంజర్' తెరకెక్కింది. ఈ మూవీ కోసం ఆయన ఒక్కటి కాదు.. రెండు కాదు.. దాదాపు 3 ఏళ్లపాటు అంకితమైపోయాడు. జూలై నెల ఆరంభంలో రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది. భారతీయుడు 2 డిజాస్టర్ తో శంకర్ కి గేమ్ ఛేంజర్ మూవీ ప్రెస్టేజ్ ఇష్యూ గా మారింది. దీనితో చిన్న తప్పు కూడా ఉండకూడదని శంకర్ భావిస్తున్నారు. చాలా సీరియస్ వర్క్ చేస్తున్నారు.

Suresh Raina made interesting comments on global star and hero Ram Charan

మరోవైపు రామ్ చరణ్ తన 16వ మూవీని బుచ్చిబాబు సనతో చేయబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ మూవీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. దీనికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందంట. గ్రామీణ క్రీడానేపథ్యంలో సాగే ఈ సినిమాలో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: suresh raina ram charan rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X