సూర్య ‘24’... మరో షాకింగ్ లుక్ (న్యూ పోస్టర్)
చెన్నై: తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ‘24' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత హీరోగా నటింస్తుండగా... మరో కీలక పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది.
సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కతున్న ఈ చిత్రంలో సూర్య డిఫరెంట్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. మన ఊహకు అందని విధంగా ఈ సినిమాలో సూర్య కనిపించబోతున్నారు. తాజాగా సూర్య వీల్ చైర్ లో కూర్చున్న లుక్ విడుదల చేసారు. చూడటానికి ఈ లుక్ కాస్త భయంకరంగానే ఉంది. ఈ చిత్రంలో సూర్య మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న ప్రాతలు పోషిస్తున్నాడు.
సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ రిలీజ్ చేయనున్నారు.
మరో వైపు ఈ సినిమా కథ లీకైందంటూ మీడియాలో ప్రచారం మొదలైంది. '24' సినిమాలో టైంమిషీన్ తరహా వాచ్ తయారు చేసిన సూర్య, దాని సాయంతో తన గతంలోకి వెళ్లి తాను చేసిన తప్పులను సరిద్దిదుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ. ఈ సినిమాలో సైంటిస్ట్ గా, అతని కొడుకుగా, ఆత్రేయ అనే విలన్ గా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడట సూర్య.
స్లైడ్ షోలో ‘24' సినిమాకు సంబంధించిన సూర్య డిఫరెంట్ గెటప్స్...

వీల్ చెయిర్ లో...
మన ఊహకు అందని విధంగా ఈ సినిమాలో సూర్య కనిపించబోతున్నారు. తాజాగా సూర్య వీల్ చైర్ లో కూర్చున్న లుక్ విడుదల చేసారు.

ఇద్దరు హీరోయిన్లు
ఈ చిత్రంలో సూర్య సరసన సమంత హీరోగా నటింస్తుండగా... మరో కీలక పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది.

సైన్స్ ఫిక్షన్
సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కతున్న ఈ చిత్రంలో సూర్య డిఫరెంట్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు.

సూర్య
సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











