సూర్య రూ.10 కోట్ల విరాళం.. ఎవరికి? ఎందుకు?

తమిళ స్టార్ హీరో సూర్య దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రెట్రో చిత్రం మే1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. అయితే ఆ సినిమా నుంచి వచ్చిన లాభాల నుంచి సూర్య రూ.10 కోట్ల విరాళం అందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. హీరోగా ఎదగడమే కాకుండా.. సోసైటీకి కూడా తనవంతు సాయం కూడా అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు సూర్య... సూర్య చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాల్లోకి వెళితే..

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ సూర్య..
కోలీవుడ్ స్టార్ హీరోగా సూర్య ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా సూర్య తన ప్రయోగాత్మక చిత్రాలతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందారు. 1997 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. యువ, శివపుత్రుడు, గజిని, ఘటికుడు, వీడొక్కడే, 7th సెన్స్, సింగం, ఆకాశమే హద్దురా, జై భీమ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు. చివరిగా 'కంగువా' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించారు.

Suriya Donated 10 Crores for Aagram Foundation

సూర్య తరుపున రూ.10 కోట్ల విరాళం..
స్టార్ హీరోగా ఎదిగినా కొద్ది సమాజాభివృద్ధి కూడా తన వంతుగా సాయం అందిస్తున్నారు. దేశంలోని పలు విపత్తుకర పరిస్థితుల్లోనూ కోట్లల్లో విరాళం అందించారు. ఇక ఆయన తాజాగా రూ.10 కోట్ల విరాళాన్ని అగరం ఫౌండేషన్ కు అందించారు. తన లేటెస్ట్ ఫిల్మ్ రెట్రో నుంచి వచ్చిన వసూళ్ల నుంచి పది కోట్ల విరాళాన్ని విద్యార్థుల చదువుల కోసం అందించారు. దీంతో సూర్య ప్రశంసలు అందుకుంటున్నారు.

అగరం ఫౌండేషన్ తో సూర్య విశేష సేవలు..
సూర్య అగరం ఫౌండేషన్ ను 2006 సెప్టెంబర్ 25న స్థాపించారు. 20 ఏళ్లలో 6000 మంది స్టూడెంట్ల చదువుకు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం 5800 మందికి విద్యార్థుల చదువుకు సూర్య ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో 2019 వరకే 3000 మంది స్టూడెంట్లు తమ హైయర్ ఎడ్యుకేషన్ ను ఈ షౌండేషన్ అందించిన సాయంతో పూర్తి చేసుకున్నారు. ఇక ఈ ఫౌండేషన్ ద్వారా 2013లో ఉత్తరాఖండ్ విపత్తుకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేశారు. తమిళ నాడులోని 400 ప్రభుత్వ పాఠశాలల రెనోవేషన్ బాధ్యతలను దశల వారీగా చేపట్టారు. ఈ ఫౌండేషన్ ను సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి రన్ చేస్తున్నారు. పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం చేయడమే ఈ సంస్థ ఉద్దేశం.

సూర్య రాబోయే చిత్రాలు..
సూర్య చివరిగా కంగువా చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. రీసెంట్ గా రెట్రో చిత్రంతో థియేటర్లలోకి వచ్చారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. శ్రియా సరసన్ ఐటెమ్ సాంగ్ తో అదరగొట్టింది. మే1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి రూ.110 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని వెల్లడించారు. ఇక నెక్ట్స్ సూర్య తన 45 చిత్రంలో నటిస్తున్నారు. ఆర్జే బాలాజీ రాబోయే చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

Take a Poll

More from Filmibeat

Read more about: suriya Retro movie tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X