సంక్రాంతి గొడవలోకి సూర్య చేరాడు: తెలుగు రీమేక్ ఆపారని తానే వస్తాడట
సంక్రాంతి వస్తే తెలుగు సినిమాల ఉత్సవం మొదలైనట్టే తియేటర్ల సద్దుబాటు కోసం మన హీరోలకే ఇంత ఇబ్బందిగా ఉంటే.. సంక్రాంతి రిలీజ్ అంటూ ఓ తమిళ స్టార్ రెడీ అవుతున్నాడు. అతనే.. సూర్య.
సంక్రాంతి పండక్కి ఐదారు నెలలుండగానే దాదాపు నాలుగు తెలుగు సినిమాలు రేసులోకి వచ్చేశాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కొత్త సినిమా జనవరి 10న.. మహేష్ బాబు-కొరటాల శివల "భరత్ అను నేను".. రామ్ చరణ్-సుకుమార్ "రంగస్థలం".. నందమూరి బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ కొత్త సినిమా సంక్రాంతినే లక్ష్యంగా చేసుకున్నాయి.

సంక్రాంతి విడుదల
వీటిలో తొలి రెండు సినిమాలకు డేట్లు కూడా ఇచ్చేశారు. వరుసగా జనవరి 10న పవన్ సినిమా.. 11న మహేష్ మూవీ విడుదలవుతాయని ప్రకటించారు. "రంగస్థలం" కూడా సంక్రాంతి విడుదల అనే ప్రకటించారు. బాలయ్య సినిమా ప్రారంభోత్సవంలో కూడా సంక్రాంతి రిలీజ్ అనే చెప్పారు.

సంక్రాంతి రిలీజ్
ఐతే ఈ నాలుగూ వస్తేనే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టం. కనీసం ఒక్క సినిమా అయినా రేసు నుంచి తప్పుకోవాల్సిందే. ఐతే మన హీరోలకే ఇంత ఇబ్బందిగా ఉంటే.. సంక్రాంతి రిలీజ్ అంటూ ఓ తమిళ స్టార్ రెడీ అవుతున్నాడు. అతనే.. సూర్య.

నానుమ్ రౌడీదా
సూర్య హీరోగా తమిళంలో "తానా సేరింద కూట్టం" అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి తెలుగులో ‘గ్యాంగ్' అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఇంతకుముందు "నానుమ్ రౌడీదా" (తెలుగులో నేనూ రౌడీనే) అనే సూపర్ హిట్ మూవీ తీసిన విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.

స్పెషల్ చబ్బీస్
కీర్తి సురేష్ కథానాయిక నటించింది. హిందీలో కొన్నేళ్ల కిందట సూపర్ హిట్టయిన ‘స్పెషల్ చబ్బీస్' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఈ సినిమాను తెలుగులో రవితేజ హీరోగా హరీష్ శంకర్ రీమేక్ చేయాలని అనుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

రీమేక్ సంగతి అటకెక్కింది
ఇంకా చర్చలు నడుస్తుండగానే ఈ చిత్రం తమిళంలో మొదలైపోయింది. సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా దీన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తారు కాబట్టి తెలుగు రీమేక్ సంగతి అటకెక్కింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

తెలుగు హీరో
స్టార్ హీరో సూర్యను తమిళుడిగా చూడరు తెలుగు ప్రేక్షకులు. ఒక తెలుగు హీరోను ఆదరించినట్లే అతడిని కూడా ఆదరిస్తారు. సూర్య కూడా తెలుగు ప్రేక్షకుల్ని బాగా పట్టించుకుంటాడు. తన సినిమాల్లో నేటివిటీ ఫ్యాక్టర్ దగ్గర చాలా జాగ్రత్త పడతాడు.

సినిమా తీసేటపుడే
సినిమా తీసేటపుడే అది డైరెక్ట్ తెలుగు మూవీ అన్న భావన కలిగించేలా శ్రద్ధ పెడతాడు. ఇక ప్రమోషన్ల టైంలోనూ తెలుగు ప్రేక్షకులకు మంచి ప్రయారిటీ ఇస్తాడు. అందుకే అతడికి ఇక్కడ చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో సరిగా ఆడని ‘24' లాంటి సినిమాలు తెలుగులో మంచి ఆదరణ పొందడం విశేషం.


Click it and Unblock the Notifications











