Suriya ET Twitter Review: సూర్య మూవీకి అలాంటి టాక్.. అదొక్కటి తప్ప అంతా.. ఫైనల్ రిపోర్ట్ ఇదే!

తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దక్షిణాది మొత్తం తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుని సత్తా చాటుతున్నాడు టాలెంటెడ్ స్టార్ సూర్య. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్న అతడు.. ఎన్నో భారీ విజయాలను అందుకున్నాడు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో అతడు చేసిన రెండు సినిమాలు 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్' ఓటీటీలోనే విడుదలయ్యాయి. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టేందుకు 'ఈటీ' అనే సినిమాతో వచ్చాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

ఎవరికీ తలవంచకంటూ వచ్చాడు

ఎవరికీ తలవంచకంటూ వచ్చాడు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే ‘ఈటీ - ఎవరికీ తలవంచకు'. పాండిరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించాడు. వినయ్ రాయ్, సత్యరాజ్, సూరి తదితరులు కీలక పాత్రలు చేశారు.

అంచనాలు పెంచేసిన అప్డేట్స్

అంచనాలు పెంచేసిన అప్డేట్స్

మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘ఈటీ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సూర్య చిత్రంపై తెలుగు, తమిళంలో బజ్ ఏర్పడింది.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ‘ఈటీ'కి భారీ బిజినెస్ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమా ఒకరోజు ముందే విడుదల కాబోతుండడంతో.. దీన్ని కేవలం రూ. 3.50 కోట్లకే కొనుగోలు చేశారు. అయితే, ఈ సినిమాను మాత్రం ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్లతో విడుదల చేస్తున్నారు.

సూర్య సినిమాకు అలాంటి టాక్

సూర్య సినిమాకు అలాంటి టాక్

స్టార్ హీరో సూర్య నటించిన ‘ఈటీ' మూవీ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆరంభంలోనే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. చాలా మంది సూర్య ‘ఈటీ' చిత్రం ఏవరేజ్‌గా ఉందని ట్విట్టర్ వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

‘ఈటీ' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం సూర్య మాస్ ఇంట్రో సీన్‌తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో సాగుతుందట. ఇందులో కూడా సెంటిమెంట్ ఓవర్ అనిపించే సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా సెకెండాఫ్ ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు.

సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

సూర్య నటించిన ‘ఈటీ' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో హీరో నటన, క్యారెక్టరైజేషన్, ఇంట్రడక్షన్ సీన్ అంటే మొత్తంగా సూర్య నటనే బాగుందని అంటున్నారు. దర్శకుడు ఎంచుకున్న కథ తెలిసిందే కావడం.. దాన్ని మలిచిన విధానం మాత్రం పేలవంగా ఉందట. అలాగే, ఓవర్ సెంటిమెంట్స్ సీన్స్, సెకెండాఫ్ మైనస్‌గా మారాయట.

Recommended Video

Latest Film Updates : Jai Bhim చిత్రం వివాదం Suriya పై ఆ సంస్థ సంచలన ప్రకటన! || Filmibeat Telugu
ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే

ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. సూర్య నటించిన ‘ఈటీ' మూవీ పూర్తిగా అభిమానులను అలరించే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే, దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్‌ప్లేతో సినిమాను ఆసక్తికరంగా మలచలేకపోయాడట. మొత్తంగా సూర్య మాస్ యాక్షన్ కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చని సినిమాను చూసిన వాళ్లు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X