twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనాథల కోసం కోట్లు విలువ ఉన్న ఇల్లు ఇచ్చేసాడు.... హీరో సూర్య

    సూర్య ఫ్యామిలీ అగరం ఫౌండేషన్ సంస్థ కోసం తాము ఉంటున్న సొంత ఇంటిని రాసివ్వడం చర్చనీయాంశం అవుతోంది. సూర్య తండ్రి శివకుమార్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అది. ఎన్నో ఏళ్లుగా వారి కుటుంబం అక్కడే నివాసం ఉంట

    |

    తమిళ స్టార్ హీరోకు నటుడిగానే కాక వ్యక్తిగానూ చాలా మంచి పేరుంది తమిళనాట. అగరం ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి.. చాలా ఏళ్లుగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్య.. అతడి కుటుంబ సభ్యులు. తల్లిదండ్రులు లేక అనాథలుగా మారిన.. పేద కుటుంబాలకు చెందిన వేలాది మంది చిన్నారులకు ఈ సంస్థ చదువు చెప్పిస్తోంది. వారి బాగోగులు చూస్తోంది. చాలామంది లాగా పబ్లిసిటీ కోసం నామమాత్రంగా ఫౌండేషన్ పెట్టి హడావుడి చేయడం కాకుండా.. చాలా సిన్సియర్ గా అగరం ను నడుపుతుందని సూర్య కుటుంబానికి పేరుంది.

    సూర్య తండ్రి శివకుమార్

    సూర్య తండ్రి శివకుమార్

    తాజాగా సూర్య ఫ్యామిలీ ఈ సంస్థ కోసం తాము ఉంటున్న సొంత ఇంటిని రాసివ్వడం చర్చనీయాంశం అవుతోంది. సూర్య తండ్రి శివకుమార్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అది. ఎన్నో ఏళ్లుగా వారి కుటుంబం అక్కడే నివాసం ఉంటున్నారు. సూర్య, కార్తీ పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనే.

    సూర్య పిల్లలు కూడా

    సూర్య పిల్లలు కూడా

    సూర్య పిల్లలు కూడా ఈ ఇంట్లోనే పుట్టారు. ఈ ఇంటిని చాలా సెంటిమెంట్‌గా భావిస్తారు శివకుమార్. కానీ కుటుంబం పెద్దది కావడంతో అందరూ కలిసి ఉండడానికి ఇబ్బందిగా ఉంటుందని ఓ పెద్ద ఇంటిని నిర్మించుకున్నారు. తమ పాత ఇంటిని అమ్మడం ఇష్టం లేకపోవడంతో ‘అగరం' ఫౌండేషన్‌కు రాసిచ్చేశారు. కోట్ల రూపాయల విలువైన ఇంటిని సేవా సంస్థకు విరళంగా ఇవ్వడంతో సూర్య కుటుంబంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

    చారిటీ కోసం దానం చేశాడు

    చారిటీ కోసం దానం చేశాడు

    ఓ మంచి పని కోసం ఆ సెంటిమెంట్లన్నింటినీ పక్కకు పెట్టేశాడు. ఇంటిని అమ్మేయకుండా చారిటీ కోసం దానం చేశాడు. కొన్ని దశాబ్దాలుగా ఆ ఇంట్లోనే ఉంటున్న సూర్య కుటుంబం.. అగరం అనే ఫౌండేషన్‌ను కూడా నడుపుతున్న సంగతి తెలిసిందే. సూర్య తండ్రి శివకుమార్ కట్టిన ఈ ఇల్లంటే సూర్య, కార్తీకి కూడా ఇష్టమే.

    కొన్ని కోట్లు విలువ చేసే ఇళ్ళు

    కొన్ని కోట్లు విలువ చేసే ఇళ్ళు

    సూర్య, కార్తీ పుట్టి పెరిగింది అక్కడే. సూర్య పిల్లలకూ ఆ ఇంటితో మంచి అనుబంధమే ఉంది. కుటుంబం పెద్దదై పోతుండడంతో ఓ పెద్ద ఇంటిని తీసుకున్నాడు సూర్య. ఆ ఇంట్లోకి మారిన కుటుంబం.. పాత ఇంటిని చారిటీకి ఇచ్చేసింది. కొన్ని కోట్లు విలువ చేసే ఇంటిని ఇలా చారిటీకి ఇచ్చేయడంతో సూర్యకు, అతడి కుటుంబానికి నలువైపులా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    అనాథ బాలలకు

    అనాథ బాలలకు

    కాగా, అగరం ఫౌండేషన్ ద్వారా అనాథ బాలలకు సూర్య ఆశ్రయం కల్పిస్తూ వారి అభ్యున్నతికి చదువు కూడా చెప్పించి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇలా కోట్లాది రూపాయల విలువైన, సెంటిమెంట్ తో కూడిన ఇల్లును సూర్య ఫ్యామిలీ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చేయడం.. అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఈ విషయంలో అందరూ సూర్యకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

    English summary
    Suriya family has donated their own house, in which they have been living for the past few decades. Suriya father Sivakumar constructed this house and he is very fond of this house. Suriya, Karthi were born and brought up in the same house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X