NGK టైటిల్ ఎందుకు పెట్టామంటే.. సూర్య క్లారిటీ
'గజిని', 'యముడు', 'సింగం' లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిర్మించిన చిత్రం 'ఎన్.జి.కె (నంద గోపాల కృష్ణ)'. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 'ఏమైంది ఈవేళ', అధినేత, 'బెంగాల్ టైగర్' వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ అందిస్తున్నారు. సినిమా టైటిల్‌ను ఇంగ్లీష్‌లో పెట్టడానికి కారణాన్ని సూర్య వివహరించారు.
మేం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ కోసం వెదుకుతున్న సమయంలో తమిళ్, తెలుగు భాషల్లో వేర్వేరు టైటిల్స్ అనుకున్నాం. కానీ 'శివాజీ', 'రోబో', '2.0'లా రెండు భాషల్లో ఒకే టైటిల్ పెడితే గుంటుందని మా పి.ఆర్ టీమ్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ సలహా ఇవ్వడం జరిగింది. అలాగే ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఎలాంటి న్యూస్ వచ్చినా టైటిల్ ఒకటే ఉంటే తొందరగా ఆడియన్స్‌కి రీచ్ అవుతుందని 'ఎన్‌జికె'ని సెలెక్ట్ చేయడం జరిగింది అని సూర్య చెప్పారు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అందాల భామలు రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాపై తమిళ, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











