మేము సైతం అంటూ... సూర్య, కార్తి, విశాల్ విరాళాలు
హైదరాబాద్: ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై హుధూద్ తుఫాన్ సృష్టించిన విధ్వంసానికి ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్ట పోయిన సంగతి తెలిసిందే. వారిని ఆదుకోవడానికి పలువురు తెలుగు సినీ తారలు ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ 50 లక్షలు, రామానాయుడు ఫ్యామిలీ రూ. 50 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు, బాలయ్య రూ. 30 లక్షలు ఇలా స్టార్ హీరోలంతా తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటించారు.

బాధితులను ఆదుకోవడానికి మేము సైతం అంటూ పలువురు తమిళ సినీస్టార్స్ కూడా ముందుకు వచ్చారు. హీరో సూర్య ఫ్యామిలీ రూ. 50 లక్షలు (సూర్య 25 లక్షలు, కార్తి రూ. 12.5 లక్షలు, కె.ఇ.జ్ఞానవేల్ రాజా రూ. 12.5 లక్షలు), హీరో విశాల రూ. 15 లక్షలు విరాళం ప్రకటించారు.
తమ సినిమాలను తెలుగు వారు ఎంతగానో ఆదరించారని, వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం తమ బాధ్యత అని ఆయా స్టార్స్ పేర్కొన్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ స్టార్స్ అంతా తమ వంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళాలు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











