హైదరాబాద్ సుల్తాన్ బజార్లో గొడవ పడ్డ హీరో సూర్య!
హైదరాబాద్: తమిళ స్టార్ హీరో సూర్య హైదరాబాద్ వచ్చి మరీ ఇక్కడ గొడవ పడ్డారు. కోఠి సమీపంలోని సుల్తాన్ బజార్లో ఆయన కొందరు వ్యక్తులతో గొడవ పడ్డారు. వారిపై చేయి చేసుకున్నాడు. ఇది చూసిన వారంతా నివ్వెర పోయారు..... ఇదంతా సూర్య తాజా సినిమా షూటింగులో భాగంమే.
సూర్య హీరోగా బిరియాని ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘మాస్'. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో సూర్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి నార్మల్ రోల్ ఒకటి కాగా, రెండోది మాత్రం చనిపోయిన ఆత్మ. సినిమాలోని కొన్ని సన్నివేశాలు హైదరాబాద్ కోఠిలోని ఉమెన్స్ కాలేజ్, సుల్తాన్ బజార్లో చిత్రీకరణ జరిపారు.

తమిళ హీరో సూర్య చేసినట్లుగా అటు మాస్, ఇటు క్లాస్ రోల్స్ సౌత్ లో ఒకే సారి చేసే హీరోలు లేరనే చెప్పాలి. సికిందర్ లో తన స్టైలిష్ లుక్ లో అదరకొట్టిన సూర్య ఈ సారి పూర్తి మాస్ లుక్ తో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
అజిత్, విజయ్‌ల తర్వాత వేగంగా పేరు తెచ్చుకుంటున్న నటుడు సూర్య. వైవిధ్య నటనతో తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినీజనాలకు కూడా దగ్గరయ్యారు. ఎప్పటినుంచో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడా ప్రాజెక్టు మొదలై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
'మంగాత్తా', 'బిరియాని' విజయాలతో హవా చాటుకుంటున్న వెంకట్‌ప్రభు తాజాగా సూర్యతో మాస్‌మసాలా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు 'మాస్' అని పేరు కూడా పెట్టారు. స్టూడియో గ్రీన్ బ్యానరుపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











