వైస్ జగన్ పాత్రలో హీరో సూర్య.. షాకింగ్!
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల కాలం సాగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ కు రంగం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు దివంగత నేత వై ఎస్ ఆర్ బయోపిక్ కు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళీ నటుడు మమ్ముట్టిని వై ఎస్ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతలోనే మరో ఆశ్చర్యకరమైన ప్రచారం జోరందుకుంది.

వైసిపి అధినేత జగన్ బయోపిక్ కు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు రావడం నిజంగా ఆశ్చర్యకరమే. జగన్ పాత్రలో స్టార్ హీరో నటించబోతున్నాడంటూ మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జగన్ పాత్రలోహీరో సూర్య నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు సూర్యని కొంతమంది సంప్రదించారు.. సూర్య, జగన్ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవల జగన్ పాదయాత్ర సందర్భంగా సూర్య శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. జగన్ కు చెందిన సంస్థ భారతి సిమెంట్స్ కు సూర్య బ్రాండ్ అంబాసిడర్ కూడా.


Click it and Unblock the Notifications











